twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్‌కు ట్విట్టర్ షాక్.. సూపర్‌స్టార్ వీడియో తొలగింపు

    |

    సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ షాకిచ్చింది. జనతా కర్ఫ్యూ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచన గురించి ఆయన చేసిన పోస్టును ట్విట్టర్ తొలగించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే విషయంపై ఆయన వీడియో సందేశాన్ని తొలగించింది. ఇంతకు రజనీకాంత్ పెట్టిన వీడియోలో ఏమున్నదంటే..

    ప్రధాని సందేశాన్ని పాటిద్దాం అంటూ

    ప్రధాని సందేశాన్ని పాటిద్దాం అంటూ

    దేశంలో కరోనావైరస్ సమాజంలో స్టేజ్ 3 దశలోకి వ్యాప్తిచెందకుండా కేంద్ర ప్రభుత్వ చర్యలు తీసుకొన్నది. దానికి మద్దతుగా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు. దానిని అందరం పాటిద్దాం అంటూ రజనీకాంత్ ఓ వీడియోను రిలీజ్ చేసి ట్విట్టర్‌లో పెట్టారు.

     స్టేజ్ 3లోకి వెళ్లకుండా నివారణ

    స్టేజ్ 3లోకి వెళ్లకుండా నివారణ

    ఇటలీ దేశం కూడా దేశవ్యాప్తంగా స్టేజ్‌3ని నివారించడానికి ఇలాంటి కర్ఫ్యూను పాటిస్తున్నది. కాబట్టి పౌరులందరూ ప్రధాని సూచనకు మద్దతివ్వాలి. ఒకవేళ పాటించకపోతే దేశం ప్రమాదంలోకి నెట్టబడే అవకాశం కూడా ఉంది. వేలాది మందికి ప్రాణముప్పు కలిగే అవకాశం లేకపోలేదు అని రజనీకాంత్ తెలిపారు.

    సంక్షోభంలో కూరుకుపోకుండా

    సంక్షోభంలో కూరుకుపోకుండా

    కరోనావైరస్ వల్ల కలిగే సంక్షోభంలో కూరుకుపోవద్దు. కాబట్టి ప్రతీ ఒక్కరు జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని నా సూచన. ఇంట్లోనే ఉంటూ కరోనా వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. సామాజిక దూరాన్ని పాటిస్తూ దేశ ప్రయోజనాలను కాపాడండి. దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న వైద్యులు, నర్సుల కోసం ఆదివారం సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టండి అంటూ రజనీ కోరారు.

    Recommended Video

    Director Shankar Responds On Indian 2 Crane Mishap
    నెటిజన్లు ఫైర్

    నెటిజన్లు ఫైర్

    రజనీకాంత్ పెట్టిన వీడియోలో తప్పుడు సమాచారం ఉందని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. 'ShameOnTwitterIndia' అనే ట్యాగ్‌తో సోషల్ మీడియాలో హోరెత్తించారు. దాంతో ట్విట్టర్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. వెంటనే రజనీకాంత్ వీడియోను తొలగించింది.

    English summary
    Super Star Rajinikanth's video on Janata Curfew deleted by twitter. It mentioned that video was against the rules of company.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X