గజ తుఫాన్ భాదితుల కోసం.. విజయ్‌లాగా మరెవరూ చేసివుండరేమో, సూపర్ స్టార్ రజని కూడా!

ఇళయ దళపతి విజయ్ విజయ విహారాన్ని ఇప్పట్లో ఎవరూ అడ్డుకోలేరేమో. ఎన్ని వివాదాలు ఎదురైనా విజయ్ నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి. మెర్సల్, సర్కార్ చిత్రాలని వివాదాలు చుట్టుముట్టినా తిరుగులేని వసూళ్లతో ఘన విజయాలుగా నిలిచాయి. ప్రస్తుతం విజయ్ సర్కార్ చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ దర్శకుడు అట్లీతో హ్యాట్రిక్ మూవీ కోసం సిద్ధం అవుతున్నాడు. ఇదిలా ఉండగా తమిళనాడులో కొన్ని ప్రాంతాలని గజ తుఫాన్ అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. తుఫాన్ భాధితున్ని ఆదుకొనేందుకు విజయ్ వైవిధ్యభరితమైన ఆలోచన చేసారు. సూపర్ స్టార్ రజని కూడా భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించి తన ఉదార స్వభావాన్ని మరోమారు చాటుకున్నారు.

పెద్ద మనసు చాటుకుంటున్న హీరోలు

పెద్ద మనసు చాటుకుంటున్న హీరోలు

ఇప్పటికే తుఫాన్ బాదుతులని ఆదుకోవడానికి పలువురు హీరోలు ముందుకు వస్తున్నారు. హీరో సూర్య కుటుంబం, విజయ్ సేతుపతి, విశాల్ చాలా మంది హీరోలు తుఫాన్ భాదితులని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. సూర్య కుటుంబం 50 లక్షలు, విశాల్ 25, విజయ్ సేతుపతి 25 లక్షలు తుఫాన్ భాదితుల కోసం విరాళం అందించారు. ఆ జాబితాలోకి తాజాగా ఇళయదళపతి విజయ్, సూపర్ స్టార్ రజని చేరారు.

 ఏ హీరో చేయని పని

ఏ హీరో చేయని పని

ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవించినపుడు హీరోల అభిమాన సంఘాల పేరుతో సేవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. విజయ్ విభిన్నంగా ఆలోచించి తుఫాన్ భాదితులని ఆదుకున్న క్రెడిట్ తన అభిమానులకే చెందేలా చేశాడు. తుఫాన్ భాదిత ప్రాంతాల్లో తన అభిమాన సంఘ నాయకులకు నేరుగా 4 లక్షల విరాళాన్ని జమచేశాడు. ఆ డబ్బుతో మీరే సహాయక చర్యలు చేపట్టాలని అభిమానులు ఆదేశించాడు. ఇది చాలా మంచి పరిణామం అని చాలా మంది ప్రశంసిస్తున్నారు.

సూపర్ స్టార్ రజని భారీ మొత్తంలో

సూపర్ స్టార్ రజని భారీ మొత్తంలో

ఇక సూపర్ స్టార్ రజనికాంత్ భారీ మొత్తంలో విరాళం అందజేసి తన ప్రత్యేకత చాటుకున్నాడు. రజనీకాంత్ గజ తుఫాన్ భాదితుల కోసం రూ 50 లక్షలు అందజేశారు. తుఫాన్ భాదితులకు తక్షణ సాయం అదెలా తన అభిమానులు సహకరించాలని రజని కోరారు. ఎలాంటి ఆపద వచ్చినా తమిళ చిత్ర పరిశ్రమ చాలా వేరంగా స్పందిస్తోంది.

 అట్లీ దర్శత్వంలో

అట్లీ దర్శత్వంలో

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భారీ చిత్రం 2.0 నవంబర్ 29న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక విజయ్ సర్కార్ చిత్రం తరువాత అట్లీ దర్శత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. వీరిద్దరికి ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో మెర్సల్, తేరి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. త్వరలో ఈ చిత్రానికి సంబందించిన అన్ని వివరాలు తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X