అమ్మోరును దర్శించకున్న రజనీకాంత్
బెంగుళూరు: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కర్నాటక ఉడిపి జిల్లాలోని కొల్లూరు మోకాంబిక టెంపుల్‌ను ఇటీవల దర్శించుకున్నారు. ప్రస్తుతం 'లింగా' షూటింగులో రజనీకాంత్ బిజీగా ఉన్నారు. షూటింగు జరిగే ప్రాంతానికి మోకాంబిక టెంపుల్ దగ్గరగానే ఉండటంతో అక్కడికి వెళ్లి వచ్చారు.
రజనీకాంత్ కోసం మోకాంబిక టెంపుల్ వద్ద నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఆలయానికి చెందిన వారు రజనీకాంత్‌కు సాదర స్వాగతం పలికారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్ ఎస్ మూర్తి, సూపరిండెంట్ రామకృష్ణ అదిగా రజనీకాంత్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. వర్షా కాలం కావడంతో ఆలయంలో రద్దీ తక్కువగానే ఉంది. దీంతో రజనీకాంత్ దర్శనం ఈజీగా అయిపోయింది. ఇక్కడ రజనీకాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

'లింగా' సినిమా విశేషాల్లోకి వెళితే...కెఎస్ రవికుమార్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాత. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లు. ఈ చిత్రంలో రజనీ దొంగగా, ఇంజినీరు గా ద్విపాత్రలలో కనపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు.
ఈ చిత్రం క్లైమాక్స్ కోసం రూ. 3 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. హై ఓల్టేజ్ క్లైమాక్స్ ఇదని, రజనీ కెరీర్ లో అద్బుతంగా మిగిలేలా చిత్రీకరించాలని దర్శక, నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. క్లైమాక్స్ సీన్లో కన్నడ నటుడు సుదీప్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











