'బాద్‌షా' తమిళ రీమేక్ ఖరారు..హీరో ఎవరంటే...
'బాద్‌షా డిసైడైతే వార్ వన్‌సైడ్ అయిపోతుంద'ని తమిళంలో పంచ్ విసరనున్నాడు. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా విజయవంతమైన 'బాద్‌షా' తమిళ రీమేక్‌లో ధనుష్ ప్రధానపాత్ర పోషించనున్నాడు. ఇక ధనుష్ మాఫియా లీడర్‌గా కోటు, సూటు వేసుకోనున్నాడు.
నిన్నటి వరకు జులాయి పాత్రల్లో కనిపించిన ధనుష్ పోలీసు సహాయక కమిషనర్‌గానూ తెరపై కనిపించనున్నాడు. దాంతో ఆయన అభిమానుల్లో ఆనందం వెల్లి వెరిస్తోంది. కొద్దిరోజుల కిందట ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన నగరంలోని ప్రసాద్ థియేటర్‌లో జరిగింది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. అద్భుతమైన సినిమా అంటూ కితాబిచ్చారు. ఆయన చూసింది ధనుష్ కోసమని సినీ వర్గాలు చెబుతున్నాయి. మామయ్యకు నచ్చడంతో ధనుష్ ఈ చిత్రం చేసేందుకు అంగీకరించాడు. ప్రస్తుతం 'మరియాన్', 'రంజానా'ల్లో నటిస్తున్న ధనుష్ ఇవి పూర్తయ్యాక 'బాద్‌షా'గా మారనున్నాడు.


Click it and Unblock the Notifications
