twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ హోళీకి రజనీకాంత్‌ సంతోషంగా లేరట...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రతి హోళీ పండగ రజనీకాంత్ చాలా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కారణం ఇదే రోజు ఆయన ‘రజనీకాంత్'గా కొత్త అవతారం ఎత్తారు. హోళీ రోజే బస్ కండక్టర్ శివాజీ రావు గైక్వాడ్ రజనీకాంత్ గా మారాడు. కాదు కాదు బాలచందర్ ఆయన్ను రజనీకాంత్ గా మార్చారు.

    అందుకే ప్రతి హోళీని రజనీకాంత్ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ సారి మాత్రం సెలబ్రేషన్స్ లేవట. అసలు ఆయన ఈ రోజు సంతోషంగానే లేరట. కారణంగా రజనీకాంత్ కు సినీ జీవితాన్ని ఇచ్చిన ఆయన గురువు కె.బాల చందర్ లేక పోడమే అని అంటున్నారు తమిళ సినీ వర్గాలు.

    Rajinikanth was 'born' Holi day

    బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 'అపూర్వ రాగంగళ్' సినిమాతో చలన చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు రజనీ. 1975వ సంవత్సరంలో శివాజీ రావు అనే రజనీకాంత్ ను బిగ్ స్క్రీన్ కు పరిచయం చేద్దామనుకున్నపుడు బాలచందర్... రజనీకాంత్, చంద్రకాంత్, శ్రీకాంత్ అనే మూడు పేర్లను సూచించి, చివరికి రజనీకాంత్ బావుందని ఆ పేరును ఖాయం చేశారట.

    ప్రతి హోళీకి తప్పకుండా తన గురువు బాలచందర్ ను కలిసి శుభాకాంక్షలు తెలుపడం రజనీకి అలవాటు. ఒక వేళ ఆయనకు దూరంగా ఉన్న గురువుగారికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుతారు. ఈ సారి బాలచందర్ లేక పోవడంతో రజనీకాంత్ హోళీ సెలబ్రేట్ చేసుకోలేక పోయాడట. బాల చందర్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే.

    English summary
    Did you know that Holi is a special day for Superstar Rajinikanth? It was during this festival day, back in 1975, that a certain bus conductor called Sivaji Rao Gaekwad became ‘Rajinikanth.’
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X