షాకింగ్.. 40 కేజీల డ్రెస్ వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా మరో మారు వాయిదా పడి జూన్ 7 న విడుదలకు సిద్ధం అవుతోంది. రజనీకాంత్ నటించిన మరో చిత్రం 2.0 కూడా విడుదల కావలసి ఉంది. 2.0 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రం పదే పదే వాయిదా పడుతూ వస్తుండడంతో 2.0 గురించే అంతా మరిచిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ప్రమాదకరం అని భావించిన చిత్ర యూనిట్ రజని అభిమానులకు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది.

శంకర్ ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారని, చిత్రం త్వరలోనే పూర్తవుతుందని అంటున్నారు. కాగా ఈ చిత్రంలో రజనీకాంత్ కీలకమైన స్టంట్స్ కోసం 40 కేజీల కాస్ట్యూమ్స్ ధరించారట. ఈ న్యూస్ అందరికి షాక్ కి గురిచేస్తోంది. బక్క పలచగా ఉండే రజని ఈ వయసులో కూడా అంత బరువైన కాస్ట్యూమ్స్ ధరించి స్టంట్స్ లో పాల్గొనడం అద్భుతం అని అంటున్నారు.

 Rajinikanth wears a 40 kg outfit in Shankars 2.0

ఆ బరువైన కాస్ట్యూమ్స్ ధరించి రజినీకాంత్ చేసే విన్యాసాలు సినిమాకే హైలైట్ అని అంటున్నారు. ఆ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో రజని చాలా ఎంజాయ్ చేశారని చిత్ర యూనిట్ చెబుతోంది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X