twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వావ్...ఇంటర్నెట్ లేకుండా నడిచే రజనీకాంత్ వెబ్‌సైట్

    By Bojja Kumar
    |

    రజనీకాంత్ అభిమానులు మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. రజనీపై తమ అభిమానాన్ని చాటు కోవడానికి ఇంటర్నెట్ లేకుండానే నడిచే వెబ్ సైట్‌ను రూపొందించారు. వినడానికి నమ్మ శక్యంగా లేక పోయినా ఇది నిజం. అదే దీని ప్రత్యేకత. ఆ వెబ్ సైట్ పేరు www.allaboutrajni.com. ఇది ఇంటర్నెట్ కనెక్షన్ తొలగిస్తేనే నడుస్తుంది. మీరు ఈ సైట్‌లోకి ప్రవేశించగానే...ఓ ప్రకటన మీకు దర్శనం ఇస్తుంది. ''ఆయన సాధారణ వ్యక్తి కాదు..ఇది సాధారణ వెబ్ సైట్ కాదు, ఇది రజనీ శక్తితో నడుస్తుంది. సైట్ లోకి వెళ్లాలంటే మీరు మీ ఇంటర్నెట్ కనెక్షన్ తొలగించాలి'' అని సూచిస్తుంది. మీరు ఇంటర్నెట్ తొలగించక పోతే అది పని చేయదు. నెట్ తొలగించి తర్వాతనే సైట్ లో ఎంటర్ అయ్యే అవకాశం లభిస్తుంది. ఎలాంటి కనెక్షన్ లేకుండానే రజనీకి సంబంధించిన వివరాలు అభిమానులకు కను విందు చేస్తాయి.

    ప్రపంచంలో ఇంటర్నెట్ లేకుండా నడిచే వెబ్ సైట్ ఇదొక్కటే. దీనిని వెబ్ చట్నీ క్రియేటివ్ డైరక్టర్ గురుబక్ష్ సింగ్ రూపొందించారు. సంక్లిష్టమైన అల్గారి థమ్స్‌ని ఉపయోగించి తయారు చేశానని, ఇంటర్నెట్ వేగం సున్నాకు చేరుకున్న తర్వాతే ఇది పని చేయడం ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. నా అభిమాన హీరోకు కానుకగా ఇచ్చేందుకు ఈ సైట్ ను రూపొందించానని గురుబక్ష్ చెప్పుకొచ్చారు. ఈ వెబ్ సైట్ చూసి ప్రపంచ వ్యప్తంగా ఉన్న రజనీ అభిమానులు సంబ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.

    ఇక రజనీ సినిమాల విషయానికొస్తే...ఆయన ప్రస్తుతం కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాడయాన్' చిత్రంలో చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్ర్కీన్ ప్లే, మాటలు కె.ఎస్.రవికుమార్ హ్యాండిల్ చేస్తున్నారు.

    English summary
    It may sound like another Rajinikanth joke, but a new website dedicated to the superstar runs 'without an internet connection'!. Visitors to www.allaboutrajni.com are greeted with a warning that ‘He is no ordinary man, this is no ordinary website. It runs on Rajini Power’ and are advised to switch off their internet connection to enter the website. Only when the web is disconnected, one is allowed to explore the site.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X