వాసు దర్శకత్వంలో చంద్రముఖి-2’ లో రజనీ?

By Staff

దక్షిణాదిన సీక్వెల్ చిత్రాల నిర్మాణం క్రమేణా ఊపందుకున్న తరుణంలో దర్శకుడు పి.వాసు 'చంద్రముఖి' సీక్వెల్ తో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కన్నడంలో రూపొందించిన 'ఆప్తమిత్ర' చిత్రానికి రీమేక్ గా వాసు ఆమధ్య రజనీకాంత్ తో తీసి 'చంద్రముఖి' చిత్రం తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వాసు మళ్లీ రజనీతోనే 'కథానాయకుడు' తీసినప్పటికీ అది బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవం చవిచూసింది. ఈ నేపథ్యంలో పి.వాసు మరోసారి కన్నడంలో 'ఆప్తమిత్ర-2' తీస్తున్నారు. తొలి వెర్షన్ లో నటించిన విష్ణువర్దన్ ఈ సీక్వెల్ లో కూడా హీరోగా నటిస్తున్నారు. ఆ చిత్ర నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ఇందులో హీరోయిన్లుగా సంధ్య, భావన, లక్ష్మీ గోపాల స్వామి, విమలా రామన్ నటిస్తున్నారు. అయితే మెయిన్ రోల్ అయిన చంద్రముఖి పాత్ర ఎవరు పోషిస్తున్నారనేది వాసు గుట్టుగా ఉంచుతున్నారు. ఇదే సమయంలో తమిళంలో కూడా రజనీకాంత్ తో 'చంద్రముఖి-2' తీయాలనే పట్టుదలతో వాసు ఉన్నారు.

రజనీకాంత్ ను కలిసి సింగిల్ లైన్ స్టోరీని ఇప్పటికే వినపించాననీ, ప్రస్తుతం ఆయన అంగీకారం కోసమే ఎదురుచూస్తున్నాననీ వాసు తెలిపారు. రజనీకాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'యంత్రం' చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఆయన కుమార్తె సౌందర్య 'సుల్తాన్ ది వారియర్' యానిమేషన్ చిత్రానికి కూడా రజనీ వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో వాసు 'చంద్రముఖి-2'కి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అన్నట్టు...వాసుకు హిందీలో ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం కూడా వచ్చిందనీ, సైఫ్ అలీ ఖాన్ ఇందులో హీరోగా నటించనున్నారనీ కూడా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X