‘బుడ్డా’ అదరహో...బుడ్డా రీమేక్ లో సూపర్ స్టార్..!?
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'బుడ్డా". ఈ చిత్రం ఎలాగైనా విజయం సాధిస్తుందని దర్శకుడు పూరి చాలా నమ్మకంతో ఉన్నాడు. అందుకే బాలీవుడ్ లో మళ్లీ గ్యాప్ రాకూడదనే అభిషేక్ తో హిందీలో 'ది బిజినెస్ మ్యాన్" చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
అయితే హిందీలో 'బుడ్డ" చిత్రం ఎలాగో విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్న పూరి, ఈ చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేయాలనుకుంటున్నాడు. 'బుడ్డా" చిత్రం కోసం పూరి రాసిన డైలాగులు అమితాబ్ చెబుతూ ఉంటే, ఎదురు తిరిగిన వాళ్లందరినీ ఇరగదీసి పడేస్తుంటే ఎలా ఉంటుంది. అదీ అమితాబ్ లాంట్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ చేస్తుంటే ఏమనిపిస్తుంది..? ఈ రోజు విడుదలైన బుడ్డా చూస్తే అభిమానులు అదరహో అంటూ కేరింతలు కొట్టక తప్పదు...
అయితే తమిళంలో రీమేక్ చేయబోయే ఈ చిత్రానికి అమితాబ్ పాత్రలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేయించాలనుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం హీరోగా మాత్రమే కొనసాగుతున్న రజనీకాంత్, ఇలాంటి వృద్దుడి పాత్రలో నటించడానికి అంగీకరిస్తాడో లేదో అనేది ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











