అప్పటి వరకు సినిమాలు చేస్తా: అభిమానులకు రజనీకాంత్ భరోసా!
తమిళనాడు అభిమానులు కోరుకున్నట్లే సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ స్థాపించారు. అయితే ఈ పార్టీ ఇంకా క్ష్రేత్రస్థాయి రాజకీయాల్లో యాక్టివ్ కాలేదు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలకు కూడా రజనీకాంత్ పొలిటికల్ పార్టీ దూరంగానే ఉంది.
మరో వైపు రజనీకాంత్‌తో పాటు పార్టీ స్థాపించిన కమల్ హాసన్... చురుకుగా పాలిటిక్స్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులను బరిలోకి దించారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఎప్పుడూ రాజకీయాల్లోకి చేస్తారు? సినిమాల్లో ఎప్పటి వరకు కొనసాగుతారు? అనే విషయంలో అయోయమం నెలకొని ఉంది.

ఈ నేపథ్యంలో రజనీకాంత్ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చింది. 2021లో తమిళనాడులో జరిగే ఎన్నికల్లో రాజనీ పోటీ చేయడంతో పాటు తన పార్టీ తరుపున అభ్యర్థులను రంగంలోకి దింపనున్నారట. అప్పటి వరకు సినిమాలు చేస్తూనే ఉంటారట.
మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాజనీ నుంచి కీలకమైన ప్రకటన వస్తుందని, ఆ తర్వాత నుంచి తన రాజకీయా పార్టీని తమిళనాడులో క్షేత్రస్థాయి నుంచి బలపరిచే ప్రయత్నాలు మొదలు పెడతారని తెలుస్తోంది.
ప్రస్తుతం రజనీకాంత్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బర్' అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా...లైకా ప్రొడక్షన్స్ అధినేత అల్లిరాజా శుభకరణ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
'దర్బార్' మూవీలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు.ఈ మూవీలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ చివరగా 1992లో వచ్చిన 'పాండ్యన్' చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించారు. మళ్లీ 27 ఏళ్ల గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండటంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











