రా.వన్ లో రజనీ...గాలి వార్తలేనా?

By Bojja Kumar

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ హీరోగా రూపొందుతున్న రా.వన్ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్నారని, దక్షిణాది మార్కెట్ ను చేజిక్కించుకోవడానికే షారుఖ్ ఆయనతో తన సినిమాలో ఓ చిన్న పాత్ర వేయిస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందంతా అసత్య ప్రచారమని రజనీ సన్నిహితులంటున్నారు. రజనీ అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని, ప్రస్తుతానికి ఏ చిత్రంలోనూ ఆయన నటించడం లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో రజనీ ఈ సినిమాలో నటిస్తున్నారనే ప్రచారంతో భారీగా డబ్బులు వెచ్చించి తమిళనాడు, కేరళ హక్కులు దర్కించుకున్న నిర్మాతలు తలపట్టుకుంటున్నారు.

షారుఖ్ ఖాన్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో షారుఖ్ హీరో కాగా, అతని భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ వెర్షన్‌లలో కూడా ఒకే సారి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. షారుఖ్ సరసన కరీనా నటిస్తోంది. అర్జున్ రాంపాల్, షహానా గోస్వామిలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విశాల్ శేఖర్ సంగీతం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్స్ నేపథ్యంలో ఈ సినిమా కథను సమకూర్చాడు దర్శకుడు అనుభవ్ సిన్హా. ఈ సినిమా అక్టోబర్ 26న థియేటర్లలో సందడి చేయనుంది. చాలా కాలంగా భారీ హిట్లు లేని షారుఖ్ ఈ సినిమా ద్వారా తన తన సత్తా చాటడానికి సిద్ధం అవుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X