సూపర్ స్టార్ రజనీకాంత్ తో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆన్ స్క్రీన్ షేరింగ్..
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించే చిత్రం 'రాణా'. ఇందులో ఆయన త్రిపాత్రాభినయం చేయబోతున్నారని తెలిసింది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించబోతున్నట్లు హిందీ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. 'రాణా' చిత్రం ద్వితీయార్ధంలో అమితాబ్ పాత్ర ఉంటుందనీ, ఈ అతిథి పాత్ర కథలో కీలకమనీ అంటున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలపై చిత్ర వర్గాలు గోప్యతను పాటిస్తున్నాయి.
రజనీకాంత్, అమితాబ్ కలిసి గతంలో 'అంధా ఖనూన్', 'గిరఫ్తార్' చిత్రాల్లో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం 'హమ్'. ఇది 1991లో విడుదలైంది. దాదాపు 20వ సంవత్సరాల తర్వాత రజిని, అమితాబ్ కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాను రజనీ కుమార్తె సౌందర్యతో కలిసి ఎరోస్ సంస్థ నిర్మిస్తోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. ఇందులో రజనీ సరసన నాయికలుగా దీపికా పదుకొణె, విద్యా బాలన్, రేఖ నటిస్తారు.


Click it and Unblock the Notifications











