ఆ వార్తను ఖండించిన రజనీకాంత్ ప్రతినిధి
సూపర్ స్టార్ రజనీకాంత్ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటిస్తున్న 'తలాష్' చిత్రంలో ఐటం సాంగు చేస్తున్నాడని, ఇందుకోసం రూ. 15 కోట్ల పారితోషికం నిర్మాతలు ఆఫర్ చేశారని ఓ రూమర్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను రజనీకాంత్ వ్యవహారాలు చూసుకునే వ్యక్తి ఖండించారు.
ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని, తలాష్ చిత్రంలో రజనీతో స్పెషల్ సాంగ్ చేయాలని అడుగుతూ ఆయన్ను ఎవరూ సంప్రదించ లేదని ఆయన స్పష్టం చేశాను. అమీర్ ఖాన్ నటించబోయే 'ధూమ్-3' చిత్రంలో రజనీ అతిథి పాత్రలో కనిపిస్తారనే వార్తల్లో కూడా నిజం లేదని, ఈ విషయాల్లో ఇప్పటి వరకు ఎలాంటి సంప్రదింపులు జరుగలేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం రజనీకాంత్ 'కొచ్చాడయాన్' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నారు. భారతీయ సినీ చరిత్రలో తొలి 3డి చిత్రం దీన్ని రూపొందిస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక మోషన్ కాప్చర్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇందులో రజనీకాంత్ 8వ శతాబ్దపు ప్యాండ్య చక్రవర్తిగా కనిపించబోతున్నారు.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం 'కొచ్చాడయాన్' చిత్రం రజనీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకుని 12.12.12 రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈచిత్రానికి రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications