రజనీకాంత్‌ కోసం ఆ ఇద్దరు హీరోయిన్లు.. క్రేజీ కాంబినేషన్‌తో 168వ మూవీ

దర్బార్ సినిమాను రిలీజ్‌కు ముస్తాబు చేస్తూనే సూపర్ స్టార్ రజనీకాంత్ మరో ప్రాజెక్టును చకచకా పరుగులు పెట్టిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చిత్రం సంక్రాంతి పండుగకు రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ 168వ సినిమా ప్రారంభానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని చెన్నై మీడియా వ్యక్తం చేసింది. ఈ సినిమా కోసం ఇద్దరు సీనియర్ హీరోయిన్లను ఎంపిక చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. ఇంతకు ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరంటే..

దర్బార్ తర్వాత

దర్బార్ తర్వాత

దర్బార్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకొన్న రజనీకాంత్ హియాలయ పర్వత శ్రేణుల్లో పర్యటిస్తున్నారు. ఆధ్యాత్మిక పర్యటనను పూర్తి చేసుకొన్న వెంటనే ఆయన తన 168వ సినిమా కోసం సిద్ధమవుతారు. ఈ ప్రాజెక్ట్ వివరాలను అక్టోబర్ 11వ తేదీన వెల్లడించారు. రజనీకాంత్ తన పర్యటన నుంచి చెన్నైకి వచ్చిన వెంటనే మరో పది రోజుల్లో ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు.

విశ్వాసం ఫేం దర్శకుడు

విశ్వాసం ఫేం దర్శకుడు

సూపర్ స్టార్ రజనీకాంత్ తన 168వ సినిమా కోసం విశ్వాసం ఫేం దర్శకుడు సిరుతై శివను ఎంచుకొన్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కే ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ రూపొందిస్తున్నది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉండటంతో ఎవరైతే బాగుంటుందనే విషయంపై పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించారు.

జ్యోతిక, మంజు వారియర్

జ్యోతిక, మంజు వారియర్

అయితే చిత్ర యూనిట్‌లో మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు మళయాల నటి మంజు వారియర్, అలాగే జ్యోతిక పేర్లను ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. అయితే అధికారికంగా వీరిద్దరి పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఇద్దరి పాత్రలు కథలో కీలకమనే విషయాన్ని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

 సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత

సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత

మంజు వారియర్, జ్యోతిక ఇద్దరూ తమ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత మంచి జోష్‌ను కొనసాగిస్తున్నారు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మంజు, జ్యోతిక, రజనీకాంత్ కాంబినేషన్ ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

రూరల్ ఎంటర్టైనర్‌గా

రూరల్ ఎంటర్టైనర్‌గా

రజనీ168 అనే తాత్కాలిక టైటిల్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ చిత్రానికి డీ ఇమ్మన్ సంగీతం అందిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మార్చనున్నారు. సాంకేతిక నిపుణుల పేర్లను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X