రజనీ 173వ సినిమా టైటిల్ ధర్మన్.. తలైవా రోల్ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాంక్!
ఇండియన్ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి రూపొందిస్తున్న చిత్రం దక్షిణాదిలోనే కాకుండా భారతీయ సినిమా పరిశ్రమలో భారీ చర్చకు దారి తీసింది. రజనీ కెరీర్‌లో 173వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు కమల్ హాసన్, దర్శకుడు మహేంద్రన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు తమిళ యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను జూన్ 24వ తేదీన ఆవిష్కరించారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఇతర విశేషాల్లోకి వెళితే...
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించే 173వ సినిమాకు ధర్మన్ అనే టైటిల్‌ను ఖరారు చేసి ఆవిష్కరించారు. టైటిల్‌తో పోస్టర్‌ను కూడా లాంచ్ చేశారు. స్టైల్‌గా డ్రస్పింగ్, డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో తలైవా దర్శనం ఇచ్చారు. చేతిలో ఓ పదునైన ఆయుధాన్ని పట్టుకొని రాజసంగా ఓ రకమైన నవ్వును నవ్వుతూ ఫోజు ఇచ్చారు. చేతులకు, కాళ్లకు రక్త మరకలు కనిపించాయి. తన కాళ్ల కింద ఓ వ్యక్తి రక్తం మడుగులో పడి ఉండటం కనిపించింది. అంటే ఈ సినిమా రజనీ స్టైల్‌లో యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నదనే విషయాన్ని నిర్మాత, దర్శకులు పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు.

అయితే ఈ సినిమాలో ధర్మన్‌గా కనిపించబోయే.. రజనీకాంత్ ఓ డాక్టర్ పాత్రను పోషిస్తున్నారు అనే విషయాన్ని సినిమా క్యాప్షన్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. The Deadly Doctor అంటూ క్యాప్సన్‌ను ప్లేస్ చేశారు. రోగుల బాగోగులను చూసే వైద్యుడిగానే కాకుండా.. సమాజానికి చీడపురుగుల్లా మారిన సంఘ విద్రోహులను ఆటకట్టించే డాక్టర్‌గా కూడా కనిపించబోతున్నారనే విషయాన్ని తెలియజేశారు. డాక్టర్ పాత్రలో యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్: అనిరుధ్, యాక్షన్: అంబరీవ్, సినిమాటోగ్రఫి: నికేత్ బొమ్మి, ఎడిటర్: ప్రదీప్ ఈ రాఘవ్, ప్రొడక్షన్ డిజైన్: ఎంఆర్ కార్తీక్ రాజ్‌కుమార్, క్యాస్టూమ్ డిజైన్: శృతి మంజరి తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందుతున్నది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నది. ఈ చిత్రాన్ని పొంగల్ బరిలో దించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ సినిమా నటీనటుల వివరాలను గోప్యంగా ఉంచారు.
రజనీకాంత్ 173వ సినిమా ఇప్పటికే ఎప్పడో ప్రారంభం కావాల్సింది. తొలుత 173వ సినిమాకు తొలుత సుందర్ సీ ని దర్శకుడిగా అనుకొన్నారు. కొన్ని కారణాల వల్ల ఆ సినిమానుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత సిబి చక్రవర్తిత సినిమాను ప్లాన్ చేశారు. కానీ అదీ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత అశ్వత్ మారిముత్తుతో రజనీ చేతులు కలిపారు.
దర్శకుడు అశ్వత్ మారిముత్తు విషయానికి వస్తే.. 2020 సంవత్సరంలో ఓ మై కడవులే సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. ఆ తర్వాత అదే సినిమాను తెలుగులో ఓరి దేవుడా చిత్రంగా రీమేక్ చేశారు. అనంతరం డ్రాగన్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. తన తొలి సినిమా తర్వాత ఏకంగా రజనీకాంత్‌ను డైరెక్ట చేసే అవకాశాన్ని ఆయన దక్కించుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications