Annaatthe: పండుగ రోజు రజినీకాంత్ సర్‌ప్రైజ్.. ఒకే ఒక్క ఫొటోతో ఫ్యాన్స్ రచ్చ

పేరుకు సీనియర్ హీరోనే అయినా.. కుర్రాళ్లతో పోటీగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌తో కనిపిస్తుంటారు సౌతిండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్. ఆరు పదుల వయసులోనూ ఎంతో వేగంగా మూవీలను చేస్తోన్న ఆయన.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక, ఈ మధ్య కాలంలో రజినీకాంత్ సరైన హిట్ కోసం వేచి చూస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. అవన్నీ ఫ్యాన్స్‌ను కూడా అలరించలేకపోయాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ను అందుకోవాలని పట్టుదలతో ఉన్నారాయన. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్టార్ హీరో నటిస్తోన్న చిత్రమే 'అన్నత్తే'.

మాస్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన శివ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం 'అన్నత్తే'. పూర్తి స్థాయి కుటుంబ కథతో రూపొందిన ఈ మూవీ షూటింగ్ చాలా ఏళ్ల క్రితమే ప్రారంభం అయింది. ఆరంభంలో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగినా.. ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా దానికి ఆటంకం ఏర్పడింది. అనంతరం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోన్న సమయంలో రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత సెకెండ్ వేవ్ వచ్చింది. ఇలా ఈ చిత్రానికి వరుస ఆటకంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్‌ను ప్రారంభించారు.

Rajinikanths Annaatthe First Look and Motion Poster on September 10th

సుదీర్ఘ విరామం తర్వాత రజినీకాంత్ నటిస్తోన్న 'అన్నత్తే' ఫైనల్ షెడ్యూల్‌ను కోల్‌కతాలో ప్రారంభించారు. అక్కడ కాళికా దేవి టెంపుల్ ఆవరణలో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ఇక్కడే షూట్ చేశారని తెలుస్తోంది. వీటితో పాటు ఫ్యామిలీ మధ్య జరిగే ఎమోషనల్ సీన్స్‌ను కూడా తీశారట. ఇక, ఇటీవలే ఈ షెడ్యూల్‌ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై చిత్ర యూనిట్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ చిత్రం నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను ఇవ్వబోతున్నట్లు తాజాగా ఓ ప్రకటన వెలువడింది.

'అన్నత్తే' మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10, ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ కాసేపటి క్రితమే ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో రజినీకాంత్ తెల్ల పంచె, చొక్కా ధరించి కనిపిస్తున్నారు. ఆయన ముఖాన్ని రివీల్ చేయకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడింది. ఇక, ఈ పోస్టర్ త్రిశూలాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రజినీ ఫ్యాన్స్ దీన్ని తెగ షేర్లు చేస్తుండడంతో వైరల్ అయిపోయింది.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'అన్నత్తే' మూవీలో రజినీకాంత్ పవర్‌ఫుల్ రోల్‌ను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు అన్నయ్య అనే టైటిల్ పెడుతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. సిస్టర్ సెంటిమెంట్‌తో వస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, రజినీకాంత్‌కు సోదరిగా నటిస్తుందట. ఇక, ఈ మూవీ నవంబర్ 4న విడుదల కాబోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X