Baasha Re Reelease: 4.5 కోట్ల బడ్జెట్.. భాషా కలెక్షన్లు ఎన్ని కోట్లు.. రజనీ మూవీ రీరిలీజ్ ఎప్పుడంటే?
ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే అంటూ భాషా థియేటర్‌లో చేసిన బాక్సాఫీస్ విధ్వంసాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం అక్కర్లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన భాషా చిత్రం 25 ఏళ్ల కిందట సంచలన విజయం సాధించింది. ఆ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, ఇతర భాషల్లో కలెక్షన్ల రికార్డులు తిరగరాసింది. అలాంటి సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
తమిళంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సత్య మూవీస్ బ్యానర్‌పై నిర్మాత ఆర్ఎం వీరప్పన్ నిర్మించిన భాషా చిత్రంలో నగ్మా, రఘువరన్, జనక్ రాజ్, శశికుమార్, విజయ్ కుమార్, చరణ్ రాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు పీఎస్ ప్రకాశ్ సినిమాటోగ్రఫిని, దేవా మ్యూజిక్‌ను, గణేష్ కుమార్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు.

ఇక భాషా సినిమాను స్టార్ నటీనటులు, సాంకేతిక నిపుణులు, భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు. దాంతో అప్పట్లో సుమారుగా 4.5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా జనవరి 12, 1995 సంవత్సరంలో విడుదలైంది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత థియేటర్లలో చేసిన కలెక్షన్ల రచ్చతో రికార్డులు తిరగారాసేలా చేశాయి.
రజనీకాంత్ స్టార్ స్టామినా, తమిళనాడులో తలైవా ప్రభంజనంతో దాదాపు మూవీ 368 రోజులపాటు ఏకధాటిగా నడిచింది. కేవలం తమిళనాడులోనే కాకుండా తెలుగు, ఓవర్సీస్‌లో కూడా సంచలన రీతిలో భారీ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా టోటల్ థియేట్రికల్ రన్‌లో సుమారుగా 46 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అప్పట్లో సౌత్ ఇండియా రికార్డుగా పేర్కొన్నారు.
ఇక ఈ సినిమా కేవలం థియేట్రికల్‌గానే కాకుండా డిజిటిల్ వెర్షన్‌కు ఇప్పటికీ భారీ ఆదరణ ఉంటుంది. ఈ సినిమా సన్ టీవీలో శాటిలైట్ హక్కులు తీసుకోగా.. ఓటీటీ విషయానికి వస్తే.. జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ సినిమాను ఓటీటీలో చూడాలనుకొనే వారు.. తీరిక వేళలలో సమయం చిక్కినప్పుడు జియో హాట్ స్టార్‌లో చూడొచ్చు.
ఇలాంటి సంచలనాలకు వేదికగా నిలిచిన భాషా సినిమాను మరోసారి ఈ తరం ప్రేక్షకులకు అందించేందుకు సినీ వర్గాలు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని ముహుర్తం నిర్ణయించారు. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే అని సినీ పండితులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











