For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rajinikanth తీవ్ర విషాదంలో.. కేడీ అని పిలిచే ప్రాణ స్నేహితుడు మరణంతో..!

  |

  ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన ప్రాణస్నేహితుల్లో ఒకరైన రామచంద్రరావు గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం మరణించారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. రామచంద్రరావు మృతిపై పలువురు స్నేహితులు, సన్నిహితులు తమ సంతాపాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రరావు, ఇతర స్నేహితులతో రజనీకాంత్ అనుబంధం ఎలా ఉండేదంటే..

  స్నేహానికి ప్రాణం ఇచ్చే రజనీ

  స్నేహానికి ప్రాణం ఇచ్చే రజనీ

  రజనీకాంత్‌కు స్నేహానికి ప్రాణం ఇస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అందుకు మనకు తెలిసిన ఉదాహరణ మోహన్ బాబు‌ను చెప్పుకోవచ్చు. కెరీర్ పరంగా పరిచయమైన మోహన్ బాబుతో మంచి స్నేహబంధం ఏర్పడింది. ఇక బాల్యం, యవ్వనం, కష్టసుఖాల్లో పాలుపంచుకొన్న వారంటే రజనీకాంత్‌కు ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. తాజాగా అలాంటి స్నేహితుల్లో ఒకరైన రామచంద్రరావు రజినీకి భౌతికంగా దూరం చేయమన్నారు.

  స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్ గ్యాంగ్

  స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్ గ్యాంగ్

  కర్నాటకలోని హనుమంతనగర్ ప్రాంతంలో రజనీకాంత్‌కు నలుగురైదు మందితో కలిసి గ్యాంగ్ ఉండేది. అందులో ఒకరే రామచంద్రరావు. 1966లో ఈ గ్యాంగ్ అంతా ఎస్ఎస్ఎల్‌సీ పరీక్షలో దారుణంగా ఫెయిల్ అయ్యారు. అయితే తెలివితేటలు లేకకాదు. ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకోలేక పోవడం వల్లే పరీక్ష తప్పామని చెప్పుకొంటారు. రజనీ స్నేహితుల్లో ఒకరైన రామచంద్రరావు సంయుక్త కర్ణాటక అనే న్యూస్ పేపర్‌లో ఫ్రూఫ్ రీడర్‌గా పనిలో చేరారు. అప్పటి నుంచి రెండు సంవత్సరాల క్రితం వరకు అక్కడే పనిచేసి రిటైర్ అయ్యారు.

  సంయుక్త కర్ఠాటక న్యూస్ పేపర్‌లో

  సంయుక్త కర్ఠాటక న్యూస్ పేపర్‌లో

  అయితే రామచంద్రరావుతోపాటు మరో స్నేహితుడు రాజన్నతో రజనీకాంత్ కూడా సంయుక్త కర్ణాటక న్యూస్ పేపర్‌లో నెలకు రూ.150 వేతనానికి పనిచేశారు. ఐదు నెలలపాటు పనిచేసిన రజనీ ఆ తర్వాత ప్రూఫ్ రీడర్ ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆ తర్వాత తరగుపేట్ మార్కెట్‌లో కూలీగా ఆ తర్వాత ఆఫీస్ బాయ్‌గా అక్కడే పనిచేశారు. మూడుసార్లు ప్రయత్నించిన తర్వాత రజనీ ఎస్ఎస్ఎల్‌సీ పరీక్ష పాస్ అయ్యారు. అనంతరం కర్ణాటక ఆర్టీసీలో కండక్టర్‌గా చేరారు. అలాంటి పరిస్థితుల మధ్య రామచంద్రరావు, రాజన్నతో మంచి అనుబంధం ఉండేది.

  రజనీకాంత్‌ను కేడీ అని పిలిచే..

  రజనీకాంత్‌ను కేడీ అని పిలిచే..

  రామచంద్రరావుతో రజనీకాంత్‌కు విడదీయలేని అనుబంధం ఉంది. తన స్నేహితుడిని ప్రేమగా, అప్యాయంగా రజీనీకాంత్ కేడీ అంటూ పిలుచుకొనే వారని స్నేహితులు చెప్పుకొంటారు. కండక్టర్‌గా పనిచేస్తూనే ఖాళీగా ఉన్న సమయంలో రజనీ తన స్నేహితులతో కలిసి రాఘవేంద్ర భవన్‌లో కాలక్షేపం చేసేవారు. అలా కాలక్షేపం చేస్తున్న సమయంలో పేపర్ కటింగ్‌లో యాక్టింగ్ కోర్సు ప్రకటన కనబడితే రజనీకాంత్ దరఖాస్తు చేసుకొన్నారు.

  15 రోజుల్లో సీటు వచ్చిందని లెటర్ రావడం, ఆ తర్వాత చరిత్రను రజనీ తిరగరాయడం అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్‌గా ఎదిగినా తన స్నేహాన్ని, స్నేహితులను ఎప్పుడూ మరిచిపోలేదని అందరూ చెప్పుకొంటారు.

  Nayanthara ఫోటో కి ఫోజ్ ఇచ్చిందా..? అంటూ నెటిజన్ల అనుమానాలు!! || Filmibeat Telugu
  రామచంద్రరావు గురించి వివరంగా

  రామచంద్రరావు గురించి వివరంగా

  ఇక రామచంద్రరావు ప్రూఫ్ రీడర్‌గానే జీవితాన్ని కొనసాగించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కూతురు, కోడలు ఉన్నారు. రామచంద్రరావు మరణంపై బెంగళూరులోని లోకాయుక్త ఎడ్యుకేషన్ ట్రస్ట్ తీవ్ర సంతాపం తెలిపింది. రామచంద్రరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించింది. ఆయన కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని దేవుడిని కోరుకొన్నది.

  English summary
  Super Star Rajinikanth's Best friend Ramachandra Rao passed away. Ramachandra Rao, who retired as a proofreader for 2 years in the compound Karnataka, has been called by actor Rajinikanth as Keddy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X