Lal Salaam Censor Review రజనీకాంత్ మూవీ ఎలా ఉంది? తలైవా హిట్టు కొట్టేనా?
సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్న చిత్రం లాల్ సలాం. ఈ చిత్రానికి రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత, లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. విష్ణు విశాల్, విక్రాంత్, జీవిత, కేఎస్ రవికుమార్, తంబీ రామయ్య తదితరులు నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సెన్సార్ అధికారుల స్పందన గురించిన వివరాల్లోకి వెళితే..
లాల్ సలాం సినిమాలో ఆసక్తికరమైన విషయాల్లో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. తొలిసారి ఈ చిత్రం సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. గతంలో వ్యాపార ప్రకటనల్లో నటించినప్పటికీ.. దక్షిణాది ప్రేక్షకులకు సినిమా ద్వారా పరిచయం కావడం ఇదే తొలిసారి అని సినిమా వర్గాలు వెల్లడించాయి.

లాల్ సలాం చిత్రంలో మొహినుద్దీన్ భాయ్ పాత్రలో రజనీకాంత్ కనిపించనున్నారు. ఆయనకు సోదరిగా నటి, దర్శకురాలు జీవిత నటించారు. చాలా ఏళ్ల తర్వాత జీవిత ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే రజనీకాంత్ భార్యగా నిరోషా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించన్నారు. దాంతో ఈ సినిమాపై అందరి దృష్టిపడింది.
ఇక లాల్ సలాం సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అధికారులు వీక్షించారు. ఈ సినిమాపై సంతృప్తి చెందిన అధికారులు ఎలాంటి కట్స్, అభ్యంతరాలు తెలియజేయకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాను రూపొందించిన విధానంపై అభినందించినట్టు సమాచారం.

ముంబై బ్యాక్ డ్రాప్‌గా అలాగే క్రికెట్ నేపథ్యంగా సాగే మాఫియా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో లాల్ సలామ్ తెరకెక్కింది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు కూడా మంచి స్పందన లభిస్తున్నది. రజనీకాంత్ ఈ సినిమా ద్వారా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











