Lal Salaam Vs Eagle: రజనీకాంత్‌ను ఢీకొట్టనున్న రవితేజ.. ఈగిల్ సింగిల్ రిలీజ్ అన్నారే?
సంక్రాంతి పండుగ బరిలో తెలుగు సినిమా రంగంలో ఐదు భారీ చిత్రాలు రిలీజ్ వ్యవహారం పెద్ద వివాదానికి దారి తీసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామి రంగ, ఈగల్ సినిమాలు పోటీలోకి దిగాయి. ఈ క్రమంలో మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున అక్కినేని, తేజా సజ్జా హీరోల మధ్య పోటీని నివారించేందుకు నిర్మాతల మండలి రంగంలోకి దిగింది. అయితే నిర్మాతలతో చర్చలు జరిపిన తర్వాత ఈగల్ సినిమాను పోటీ నుంచి తప్పించారు. అయితే ఆ వివాదం, ఈగల్ సినిమాకు పోటీగా వచ్చే సినిమాలు వివరాల్లోకి వెళితే..
సంక్రాంతి బరి నుంచి ఈగల్ సినిమాను తప్పించడానికి సానుకూల దృక్పథంతో జరిపిన చర్చలతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తమ సినిమా రిలీజ్ డేట్‌ను ఉపసంహరించుకొన్నారు. అందుకుగాను నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ తరఫున హామీ ఇస్తూ ఈగల్ సినిమాకు పోటీగా లేకుండా ఆ మూవీ సింగిల్‌గా రిలీజ్ చేయడానికి చర్యలు తీసుకొంటాం అని దిల్ రాజు చెప్పారు.

ఆ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ఈగిల్ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ అవుతుంది. ఆ సమయంలో వచ్చే సినిమాల రిలీజ్‌ను ఆపుతాం. ఆ క్రమంలో పోటీ నుంచి డీజే టిల్లు తప్పకుంటుంది అని చెప్పారు. దాంతో సమస్యకు పరిష్కారం లభించింది అని అనుకొన్నారు. కానీ ఫిబ్రవరి 9 తేదీన మరిన్ని సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి.
సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినిమా లాల్ సలామ్‌ను ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు లైకా ప్రొడక్షన్ రిలీజ్ డేట్‌ను ఫిబ్రవరి 9వ తేదీగా ప్రకటించారు. దాంతో రజనీకాంత్ లాంటి స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుండటంతో ఈగిల్ సినిమాకు భారీ పోటీ ఏర్పడింది. దాం ఈ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది.
ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ అయ్యే సినిమాల వివరాల్లోకి వెళితే. ఇప్పటికే రవితేజ నటించిన ఈగిల్ సినిమా రిలీజ్ డేట్ కన్ఫార్మ్ అయింది. ఇక రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ కూడా బరిలోకి దూకింది. ఇంకా ఈ సినిమాలకు పోటీగా యాత్ర 2, అలాగే ఊరు పేరు భైరవకోన సినిమాలు కూడా రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి.
ఇలాంటి క్రమంలో ఈగిల్ సినిమాకు పోటీగా లాల్ సలామ్ సినిమాను తప్పించడం కష్టంగానే మారింది. అయితే తెలుగు సినిమాలు యాత్ర 2, ఊరుపేరు భైరవ కోన సినిమాల రిలీజ్‌ను వాయిదా వేయిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వివాదానికి త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











