చెన్నైలో వరద భీభత్సం.. రజనీకాంత్ నివాసాన్ని ముంచెత్తిన వరద నీరు!
తమిళనాడును భారీ వర్షాలు ముంచెతుతుండటంతో జన జీవనం స్థంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు కురియడంతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరం పూర్తిగా జలమయం అయింది. దాంతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా, అత్యంత విలాసవంతమైన ప్రాంతం పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ నివాసాన్ని వరదలు ముంచెత్తాయి. ఆ వివరాల్లోకి వెళితే..
చెన్నైలో వర్షాలు, వరద పరిస్థితి భీభత్సంగా మారింది. పలు సూల్స్, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. పలు ప్రాంతాలు భారీ వర్షాలకు నీట మునిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దాంతో ప్రభుత్వం అధికారులు రంగంలోకి దిగారు. ప్రజల సౌకర్యార్థం 1913 హెల్ప్ లైన్ నంబర్‌ను చెన్నై కార్పోరేషన్ అందుబాటులోకి తెచ్చింది.

ఇదిలా ఉండగా, చెన్నైలో అత్యంత సంపన్నులు, ప్రముఖ రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఉండే పోయెస్ గార్డెన్‌ను వరదలు ముంచెత్తాయి. ఈ ప్రాంతంలోనే ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసాన్ని వరద నీరు ముంచెత్తింది. చెన్నైలో ల్యాండ్ మార్క్‌గా నిలిచిన ఈ ప్రాంతానికి భారీగా వరద నీరు చేరుకోవడంతో రజనీకాంత్ ఇంటిలోకి నీళ్లు భారీగా వచ్చాయని తెలిసింది.
తెయనామ్‌పేటలోని రజనీకాంత్ విలాసవంతమైన విల్లాలో నీళ్లు చేరిన విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 24 గంటలపాటు ఏకధాటిగా వర్షం పడటంతో డ్రైనేజీ వ్యవస్థ నిర్వీర్యం కావడంతో వరద నీరు రజనీ కాంత్ ఇంటిలోకి చేరిందనే విషయం సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా స్పష్టమైంది. ఈ ప్రాంతంలోని ధనుష్, ఇతర సెలబ్రిటీల ఇంట్లోకి కూడా నీరు చేరిందని సమాచారం.
అయితే వరద భీభత్పంపై ఇంకా రజనీకాంత్ స్పందించలేదు. అయితే పోయెస్ గార్డెన్ హై సెక్యూరిటీ జోన్ కావడంతో వెంటనే అధికారులు, కార్పోరేషన్ సిబ్బంది వరద నీరు మళ్లింపు చర్యలను చేపట్టారు. అయితే ఈ ప్రాంతంలోని నివాసితులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంతో భారీ ప్రమాదమే తప్పిందని నెటిజన్లు అంటున్నారు.
ఇదిలా ఉండగా, రజనీకాంత్ నటించిన వేట్టయాన్ చిత్రం ఇటీవల రిలీజై భారీ వసూళ్లు రాబడుతున్నది. వర్షాల కారణంగా ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా క్షీణించాయి. ఈ చిత్రం ఇప్పటికే 250 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. అమితాబ్, రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్ నటించిన ఈ సినిమా మంచి స్పందన కూడగట్టుకొంటున్నది.


Click it and Unblock the Notifications











