twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ponniyin Selvan ఇండియన్ సినీ చరిత్రను తిరగరాస్తుంది.. రజనీకాంత్ సెన్సేషనల్ కామెంట్

    |

    సంచలన దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాల, ప్రభు, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, జయరాం, పార్తీబన్ తదితరులు నటించిన పొన్నియన్ సెల్వన్ చిత్రం సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ చెన్నైలో భారీగా ఆడియో లాంఛ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకలో రజనీకాంత్ ప్రసంగం అందర్నీఆకట్టుకొన్నది. ఈ స్పీచ్ వివరాల్లోకి వెళితే..

    పొన్నియన్ సెల్వన్ సినిమా ఇప్పటి వరకు ఎందుకు తీయలేదని అనుమానం నన్ను వెంటాడుతుండేది. అమరార్ కల్కి కృష్ణమూర్తి రాసిన కల్కి లాంటి నవలను ఎందుకు తెరకెక్కించలేదని అనుకొనే వాడిని. చాలా మంది ప్రయత్నాలు చేసి వదిలేశారు. గతంలో ఈ సినిమా తీస్తే.. వల్లవరాయన్ పాత్రను నేనే చేస్తే బాగుండేదని అనుకొనే వాడిని. అరుల్ వర్మన్ పాత్రను కమల్, ఆదిత్య కరికాలన్ విజయ్ కాంత్ చస్తే బాగుండేదని అనుకొన్నాను. నందిని పాత్రను రేఖ, పెరియా పాత్రను సత్యరాజ్ చేస్తే బాగుండేదని అనుకొన్నా. ఇలాంటి కలలు కన్న నాకు మణిరత్నం ఈ సినిమా తీయడం హ్యాపీగా ఉందని రజనీకాంత్ చెప్పారు.

    Rajinikath says Mani Ratnams Ponniyin Selvan movie create history in Indian film Industry

    ఆ తర్వాత పొన్నియన్ సెల్వన్ సినిమా ఎందుకు తీయలేదో నాకు అర్ధమైంది. అప్పట్లో ఈ కథను తీయాలంటే ఒక పార్టు సరిపోదు. పార్ట్ 1, పార్ట్ 2 అనే కాన్సెప్ట్ అప్పుడు లేదు. బాహుబలి తర్వాత ఈ కాన్సెప్ట్ వర్కవుట్ అవుతుందని అనుకొన్నారు. పొన్నియన్ సెల్వన్ సినిమా ఇండియన్ సినిమాలో గొప్ప చరిత్రను తిరగరాస్తుంది అని రజనీకాంత్ జోస్యం చెప్పారు.

    English summary
    Super Star Rajinikath says Mani Ratnam's Ponniyin Selvan movie create history in Indian film Industry. He said, This film will become an achievement in Indian cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X