Rajinikanth: ఇక కరోనా అంతు చూద్దాం.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొన్న సూపర్ స్టార్!
కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో కూడా సూపర్‌స్టార్ రజనీకాంత్ హైదరాబాద్‌లో జరిగిన అన్నాతే షూటింగులో విస్తృతంగా పాల్గొన్నారు. ఇటీవల అన్నాతే షూటింగును పూర్తి చేసుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి చెన్నైకి చేరుకొన్నారు. చెన్నైలొని తన నివాసానికి చేరుకొన్న రజనీకాంత్‌కు భార్య లత హరతీ ఇచ్చి దిష్టి తీసి ఇంటిలోకి తీసుకెళ్లారు. రజనీకాంత్ ఇంటికి చేరుకొన్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన విషయం తెలిసిందే.
ఇంటికి వెళ్లిన రజనీకాంత్ కోవిడ్19ను ఎదురించి వ్యాక్సిన్‌ను తీసుకొన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వైద్యులు ఆయనకు వ్యాక్సిన్ వేశారు. ప్రస్తుతం ఆ ఫోటోను రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్ షేర్ చేయగా వైరల్ అయింది.
రజనీకాంత్ వ్యాక్సిన్ తీసుకొంటుండగా ఫోటోను తీసి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మన తలైవర్ వ్యాక్సిన్ తీసుకొన్నారు. మనమంతా కలిసి ఐక్యంగా కరోనావైరస్‌పై పోరాటం చేద్దాం అని ఓ సందేశాన్ని పోస్టు చేశారు.

తన పోస్టులో మాస్క్ తప్పనిసరిగా ధరించండి. ఐక్యంగా పోరాటం చేద్దాం. ఇంటి పట్టునే ఉంటే సురక్షిత చర్యలు తీసుకోండి. తైలవర్ వ్యాక్సిన్ తీసుకొన్నాడనే హ్యాష్ ట్యాగ్స్‌ను షేర్ చేశారు.
అన్నాతే మూవీకి సిరుతాయి శివ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో అజిత్‌తో వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం సినిమాలు రూపొందించారు. అన్నాతే చిత్రంలో నయనతార, మీనా, కుష్బూ కీలక పాత్రలను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











