ఎవిఎమ్ సంస్థపై రజనీ ఫ్యాన్స్ ఆగ్రహం!!
సూపర్ స్టార్ రజనీకాంత్ జన్మదినోత్సవం అభిమానుల ఆగ్రహంతో గడుస్తోంది. చెన్నయ్ వీధుల్లో అభిమానులు ఆగ్రహంతో శివాజీ సినిమా నిర్మించిన ఎవిఎమ్ సంస్థ బ్యాన్నర్ పై బురద, పేడతో నింపారు. ఆర్థికంగా చితికిపోయిన ఎవిఎమ్ సంస్థ శివాజీ సినిమా లాభాలతో నిలదొక్కుకుంది. ఈ క్రెడిట్ పూర్తిగా రజనీకాంత్ దే అనడంలో సందేహం ఎవరికీ లేదు. ఎవిఎమ్ సంస్థ నిలదొక్కుకోవడానికి కారణమైన రజనీకాంత్ జన్మదినోత్సవంనాడు ఆ సంస్థ ఒక్క అడ్వర్టయిజ్ మెంట్ ను కూడా ఇవ్వలేదని అభిమానులు ఆగ్రహించారు.
రజనీకాంత్ వీరాభిమాని రజనీ మురుగేషన్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. ఎవిఎమ్ సంస్థను ఆడిపోసుకున్నాడు. ఆయన మాటల్లోనే...ఎవిఎమ్ సంస్థ తీరు చాలా నిరుత్సాహపరిచింది..గ్రీటింగ్స్ చెబుతూ ఒక్క అడ్వర్టైజ్ మెంట్ వస్తుందని అనుకున్నాను..కానీ వారు నిరుత్సాహపరిచారు..పైగా రెగ్యులర్ గా వచ్చే శివాజీ అడ్వర్టైజ్ మెంట్ ను కూడా నిలిపేశారు...శివాజీ సినిమాతో కోట్లు దండుకున్న ఎవిఎమ్ సంస్థ ఒక్క అడ్వర్టైజ్ మెంట్ కూడా విడుదల చేయకుండా రజనీని తీవ్రంగా అవమానించింది...ఇకనుంచి ఆ సంస్థ నిర్మించే సినిమాలను చూడమ...ని శపథం చేశారు.
మరోవైపు అల్బర్ట్ థియేటర్ లో ప్రదర్శతమవుతున్న రజనీ పాత సినిమా చూడడానికి వచ్చిన అభిమానులు సైతం ఎవిఎమ్ సంస్థ తీరుపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఎవిఎమ్ సంస్థ ప్రతినిధులు మాత్రం రజనీ అభిమానులు ఆగ్రహంపై పెదవి విప్పడంలేదు.


Click it and Unblock the Notifications











