తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న యానిమేటెడ్ చిత్రం సుల్తాన్ ది వారియర్ అనే చిత్రంలో నాలుగు పాటలు ఉంటాయని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రజనీ కూతురు సౌందర్య చెప్పారు. యానిమేషన్ చిత్రంలో రజనీకాంత్ నటించడం భారత సినీ రంగంలో చారిత్రాత్మకమైన సంఘటన అని ఆమె అభివర్ణించారు. దీనికి 12 మంది యానిమేషన్ డైరెక్టర్లు పని చేస్తున్నారని ఆమె చెప్పారు. యానిమేషన్ చిత్రంలో రజనీ నటించడానికి అంగీకరించడమే గొప్ప విషయమని అంటున్నారు. ఈ సినిమా చైనీస్, జపానీ భాషల్లోనే కాకుండా మొత్తం 12 భాషల్లో నిర్మాణమవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్, విలన్, కమెడియన్లు ఉంటారని సౌందర్య చెప్పారు.
Story first published: Tuesday, July 14, 2026, 8:39 [IST]