ప్రముఖ నిర్మాత అశ్వనీదత్, రజనీకాంత్ కాంబినేషన్ లో రూపొందే సినిమాకు కుచేలుడు అనే పేరు ఖరారు చేశారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళంలో విజయం సాధించిన కథా వరయం బోల్ సినిమాకు ఇది రీమేక్. తమిళంలో ఈ సినిమాను కె. బాలచందర్ నిర్మిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మాణమయ్యే ఈ సినిమా తెలుగులో మరో హీరోగా జగపతిబాబు నటిస్తున్నాడు. ఈ పాత్రను తమిళంలో పశుపతి చేస్తారు. తమిళంలో సినిమాకు కుచేలన్ నామకరణం చేశారు. పశుపతి సరసన సిమ్రాన్ కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. తెలుగులో కూడా ఆమె అదే పాత్రను చేస్తుందా లేదా అనేది తెలియదు.