కమల్ చేసిన పాత్రలో రజనీకాంత్

By Srikanya

చెన్నై : సీక్వెల్ చిత్రాలు హవా నడుస్తోంది. ఈ నేపధ్యంలో రజనీకాంత్ కూడా ఓ సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అది మరేదో కాదు భారతీయుడు చిత్రం సీక్వెల్ గా రూపొందిన కథకు ఆయన హీరోగా చేయటానికి ఓకే చేసాడని తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. అవినీతిపై పోరుగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ సీక్వెల్ లో క్రింద స్ధాయిలో లంచగొండితనం...వ్యవస్ధని శాసించే అవినీతిగా ఎలా మారుతుంది...దాని పై హీరో ఎలా పోరాటం చేసి విజయం సాధించాడనే విషయం ప్రధానం గా ఉంటుందంటున్నారు. ఆమ్ ఆద్మి పార్టీ అధికారంలోకి రావటం,క్రేజీవాల్ కి దేవ వ్యాప్తంగా గుర్తింపు రావటం,అన్నా హజారే పోరాట స్పూర్తి ఈ చిత్రానికి ప్రేరణ అంటున్నారు.

శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడా చిత్రం సీక్వెల్ తీయటానకి దర్శకుడు శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ చిత్రంలో హీరోగా కమల్ ని కాకుండా రజనీకాంత్ ని తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. రోబో సమయంలోనే శంకర్...రజనీకాంత్ కి ఈ స్టోరీ లైన్ చెప్పారు..కానీ ఇన్నాళ్లళు ఆ టైమ్ వచ్చినట్లు భావిస్తున్నారు.


మరో ప్రక్క తమిళంలో మాత్రం చంద్రముఖి సీక్వెల్ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే రజనీసైడ్ నుంచి ఏ విధమైన కన్ఫర్మేషన్ రాలేదు. దాంతో ఈ సినిమాపై అభిమానులలో సస్పెన్స్‌ నెలకొంది. మధ్యలో అజిత్‌ 'చంద్రముఖి-2'లో నటిస్తారనే వార్తలొచ్చినా అవేవీ కార్యరూపం దాల్చలేదు. రజనీ నటిస్తానంటే రెండో భాగం తెరకెక్కించేందుకు తాను సిద్ధమే అంటున్నారు 'చంద్రముఖి' దర్శకుడు పి.వాసు. పి.వాసు మాట్లాడుతూ ''ఓ సూపర్‌స్టార్‌ అయినా.. సాదాసీదాగా ఉండటాన్ని రజనీ నుంచే నేర్చుకోవాలి. ఎవరైనా ఆయనతో ఒక్కసారి మాట్లాడితే చాలు.. అభిమానించటం ప్రారంభిస్తారు. ఆయన నటించాలేగానీ సీక్వెల్‌ తెరకెక్కించేందుకు నేను సదా సిద్ధం. రజనీ ఒప్పుకోకుంటే కనీసం సెట్స్‌పైకి కూడా ఎక్కదు''అని పి.వాసు పేర్కొన్నారు.

'రోబో' తర్వాత రజనీకాంత్‌ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్‌స్టార్‌. సీనియర్‌ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం. ఇందులో రాణా, కోచ్చడయాన్‌గా రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటికే ట్రైలర్‌ విడుదల చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X