రజనీకాంత్ మాటల్లో నిజం!!
రజనీకాంత్ దక్షిణాది సినీ పరిశ్రమల్లో స్టయిల్ లో తన అభినయానికి మారు పేరు. అశేషాభిమానుల్ని పాంతాలకతీతంగా సంపాధించుకున్న రజనీకాంత్ నోటివెంట ఏ మాట వచ్చినా లేటుగా వచ్చిన లేటెస్ట్ గానే వుంటుంది. ఆ మాటలు ప్రతి నోట ఒక్కసారైనా నెమరేసుకోకుండా వుండలేరు. అంతటి సంచలనంగా మారుతాయి అతని డైలాంగులు.
ఇప్పడిదంతా ఎందుకంటే, తమిళనాట సినీనటి భువనేశ్వరి వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డం, ఆ తర్వాత దినమలర్ పత్రికలో పలువురు నటీమణుల ఫోటోల్ని ఈ కేసుకు లింకు పెడుతూ కథనాలు రావడం తెల్సిన విషయాలే. అయితే ఈ తతంగంపై మండిపడ్డ రజనీకాంత్, మహిళలన్న ఆలోచన పక్కన పెట్టి, ఎలాంటి ఆధారాలూ లేకుండా నటీమణుల ఫోటోల్ని ప్రచురించడం వ్యభిచారం కన్నా హీనమని దినమలర్ పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు మహిళలతో వ్యభిచారం చేయిస్తోన్నదెవరు? వారిని వ్యభిచార కూపంలోకి నెడ్తున్నదెవరు? చేతనైతే అవన్నీ రాయండి అంతే కానీ చేతకాని రాతలు రాసి, పత్రికల పాపులారిటీ పెంచుకోవడానికి ప్రయత్నించొద్దంటూ రజనీ హెచ్చరించాడు.
రజనీకాంత్ ఇంతటి ఆవేశం చూస్తుంటే మహిళల పట్ల ఆయనకున్న అభిమానానికి ఇదొక నిదర్శనమని చెప్పొచ్చు. రజనీమాటల్లో నూటికి నూట యాభై శాతం నిజం వుందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











