twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రక్తచరిత్ర' హింసాత్మక చిత్రమే కానీ....వర్మ

    By Srikanya
    |

    ఇది హింసాత్మక చిత్రమే కానీ భావోద్వేగాల్లోనే హింస ఉంటుంది. పాత్రల ఎక్సట్రీమ్ మరియు ఇండిడ్యువాలిటీ ఈ చిత్రంలో మీరు చూడచ్చు అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ప్రతీకారమే పరమావిధి అనే మహాభారత సూక్తిని ఉదహరిస్తూ..రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం రక్త చరిత్ర ప్రోమోలు విడుదల అయ్యాయి. చెన్నైలో ఈ ప్రోమోలు విడుదల చేసిన సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ...నాకు ఎప్పుడూ డార్క్ సైడ్ కి సంభందించిన టాపిక్స్ అంట్ ఇష్టం. అలాగే ఈ చిత్రం కూడా అటువంటి అంశాలనే ప్రతిఫలిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని ఇంటీరియర్ లో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా ఈ చిత్రం చేయటం జరిగింది. ఈ చిత్రాన్ని అనేక భాషల్లో రూపొందించి ఎక్కువ మందికి చేరేటట్లు చేయాలన్నది నా తాపత్రయం.

    ఇక మద్దెల చెరువు సూరి గా వేసిన తమిళ నటుడు సూర్య మాట్లాడుతూ..నేను ఓ రోడు నా మెయిల్ ఇన్ భాక్స్ లో నేను మీ కాక కాక చిత్రం ఇంటెన్సిటీని ఇష్టపడ్డాను అనే మెయిల్ చూసాను. అది రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చింది. ఆ తర్వాత మేమిద్దరం కలిసి మంచి స్నేహితులమయ్యాం. ఇంతకాలానికి మా కాంబినేషన్లో రక్త చరిత్ర వస్తోంది. ఇక ఈ చిత్రం ఫాంటసీ కాదు. నిజ జీవిత సంఘటనల స్పూర్తిగా తయారైంది అన్నారు.

    ఇక సూరి భార్య భానుమతి పాత్రలో ప్రియమణి చేస్తోంది. పరిటాల రవి జీవిత కథ ఆధారంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తున్నారు. పరిటాల రవిగా వివేక్ ఒబరాయ్ చేస్తున్నారు. సీనర్జి పతాకంపై మధు మంతెన, శీతల్‌ వినోద్‌ తల్వార్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే వారం నుంచి ఈ చిత్రం షెడ్యూల్‌ ముంబైలో జరగనుంది. బిజెనెస్ రీత్యా ఈ చిత్రం మంచి క్రేజ్ సృష్టించే అవాకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X