RC 15: శంకర్ కోసం బ్యాక్ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టిన రామ్ చరణ్.. లుక్ టెస్టుకు రెడీ!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ పెద్ద సినిమాలు చేస్తున్న వారిలో రామ్ చరణ్ కూడా పోటీ పడుతున్నాడు. RRR అనంతరం శంకర్ దర్శకత్వంలో సినిమాను స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో చేయాలని అనుకున్న శంకర్ అనుకోకుండా మెగా తనయుడితో సినిమా చేస్తుండడం విశేషం. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్ మోస్ట్ ఫినిష్ అయ్యాయి.

దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే థమన్ శంకర్ ఆలోచనలకు తగ్గట్లుగా ఒక భారీ సాంగ్ ను కంపోజ్ చేసి రెడీ చేశాడు. ఆ సాంగ్ తోనే షూటింగ్ సందడి మొదలు కాబోతోంది. ఇక సినిమాలకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే రామ్ చరణ్ కు శంకర్ ఒక లుక్ టెస్ట్ నిర్వహించబోతున్నాడట.

Ram charan background work on shankar movie and look test in Mumbai

సినిమాలో చరణ్ ఒక యువ కలెక్టర్ పాత్రలో నటించున్నట్లు టాక్ వస్తోంది. సెకండ్ హాఫ్ లో అతను మళ్ళీ ఒక రాజకీయ నాయకుడిగా మారితే ఎలా ఉంటాడు అనే లుక్స్ పై కూడా చర్చలు మొదలు పెట్టారు. నిజానికి ఒక పర్ఫెక్ట్ కలెక్టర్ ఎలా ఉంటాడు? వారు నడిచే విధానం, మాట్లాడే తీరు.. ఇలా క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ కాస్త బ్యాక్ గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నాడట.

ఎలాగైనా సినిమాలోని పాత్ర నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండాలని, శంకర్ స్థాయికి ఏ మాత్రం తక్కువ కాకుండా ఉండకూడదని రామ్ చరణ్ ఆలోచిస్తున్నాడు. మరి ఆ పాత్ర ఏ స్థాయిలో క్లిక్కవుతుందో చూడాలి. ఇక సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ సమయానికి పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ఒక ప్లాన్ సెట్ చేసుకున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X