తమిళ టీవీ ఛానెల్లో రామ్ చరణ్ హవా
రామ్ చరణ్ హవా..తమిళంలోనూ కొనసాగుతోంది. మొన్న సంక్రాంతి సందర్బంగా అక్కడ ఓ టీవీ ఛానెల్ వారు 'మావీరన్-సంక్రాంతి స్పెషల్'పేరుతో ఓ పోగ్రాం చేసారు. దానికి విపరీతమైన రేటింగ్స్ వచ్చినట్లు చెన్నై సమాచారం. దాంతో ఇప్పుడు మిగతా టీవీ ఛానెల్స్ వారు కూడా రామ్ చరణ్ మీద ప్రత్యేకమైన పోగ్రామలు చేయటానికి ఫిక్సై పోయారు. ఇక ఈ 'మావీరన్' ఏమిటా అంటే తెలుగులో రామ్ చరణ్ చేసిన బ్లాక్‌బస్టర్ హిట్ 'మగధీర'రీమేక్ పేరు అది. ఆ చిత్రంలోని కొన్ని సీన్స్ కట్ చేసి ఈ పోగ్రాం చేసారు.
ఈ ప్రీమియర్ షో పేరట చేసిన ఈ టెలీకాస్ట్ టీఆర్పీల్లో మంచి వసూళ్లు సాధించింది. దాంతో ఈ విషయం రామ్ చరణ్ అభిమానుల్లో ఆనందం నింపుతోంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ రచ్చ చిత్రం చేస్తున్నారు. సంపత్ నంది దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ చిత్రం తర్వాత వినాయిక్ దర్శకత్వంలో చిత్రం చేయటానికి కమిటయ్యారు. అలాగే రచ్చ చిత్రాన్ని మహాశివరాత్రికి రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆరెంజ్ ప్లాప్ తర్వాత విడుదల అవుతున్న రామ్ చరణ్ చిత్రం ఇదే. రచ్చ చిత్రాన్ని కూడా తమిళంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అక్కడ క్రేజ్ తో రెండు భాషల హీరోగా సెటిలవ్వాలని చరణ్ ఆలోచనగా చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











