'రచ్చ'తమిళ వెర్షన్ టైటిల్ ఏమిటంటే...
రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ మూడు భాషల్లో ఒకే సారి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో రచ్చ చిత్రానికి టైటిల్ ని రాగలై అని పెట్టినట్లు సమాచారం. గతంలో మగధీర చిత్రాన్ని మావీరన్ గా డబ్ చేసి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రచ్చ చిత్రం కూడా తమిళంలో మంచి మార్కెట్ చేస్తుందని,అంతకంటే ఎక్కువ ప్రింట్స్ తో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలోని గీతాల్ని ఈనెల 11న హైదరాబాద్‌లో విడుదల చేస్తామనన్నామని నిర్మాతలు చెప్తున్నారు.
నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, పారాస్‌జైన్ మాట్లాడుతూ... మణిశర్మ అందించిన బాణీలన్నీ బాగున్నాయి. అభిమానులకే కాదు, అందరికీ తప్పకుండా నచ్చుతాయి. ముఖ్యంగా 'గ్యాంగ్ లీడర్'లో 'వానా వానా వెల్లువాయె' పాట రీమిక్స్ చేసిన విధానం ఆకట్టుకొంటుంది. చరణ్ స్టెప్పులు కొత్త తరహాలో తీర్చిదిద్దాం. త్వరలోనే సినిమా విడుదల వెన్యూ ప్రకటిస్తామని అన్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. చరణ్ తండ్రిగా తమిళ నటుడు పార్తిబన్ ఫ్లాష్ బ్యాక్‌లో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
ఈ చిత్రంలో చెర్రీ మెడికో పాత్రలో నటిస్తున్నాడు. అని పాత్ర పేరు విశ్వం.
సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, ఛాయాగ్రహణం:సమీర్‌రెడ్డి, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి.


Click it and Unblock the Notifications











