లారెన్స్ చేతుల మీదుగా 'బ్రూస్‌లీ-2'
చెన్నై : రామ్ చరణ్, రకుల్ ప్రీత్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'బ్రూస్‌లీ 2' తమిళ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం నేడు లారెన్స్ చేతుల మీదుగా జరగింది. ఈ చిత్రం వర్కింగ్ స్టిల్స్‌ని నటి రకుల్ ప్రీత్ విడుదల చేశారు. శుక్రవారం ఆమె తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వీటిని విడుదల చేశారు. ఈ చిత్రం తమిళంలో 'బ్రూస్‌లీ 2 ది ఫైటర్' పేరుతో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. నేడు ఆడియో విడుదల సందర్భంగా ఆమె వీటిని అభిమానులతో పంచుకున్నారు.

ఈ చిత్రాన్ని తమిళంలో ‘బ్రూస్ లీ-2' పేరుతో విడుదల చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా తమిళంలో ‘బ్రూస్ లీ' సినిమా ఆల్రెడీ సెట్స్ పై ఉండటంతో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాకు ‘బ్రూస్ లీ-2' అని పేరు పెట్టారు. బ్రూస్ లీ -2 ఆడియో అక్టోబర్ 7న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని భద్రఖాళీ ఫిల్మ్స్ తమిళంలో విడుదల చేస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
'రామ్‌చరణ్ లాంటి పెద్ద హీరోతో తొలిసారి నటించా. ఈ సినిమాలో చాలా గ్లామర్‌గా కనబడ్డానని అందరూ అంటున్నారు. నా లుక్ కోసం దర్శకుడు శ్రీనువైట్ల చాలా కష్టపడ్డారు. చరణ్‌తో డ్యాన్స్ చేయడం చాలా కష్టం. సాంగ్ షూటింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే సాధన చేసేదాన్ని. ఈ విషయంలో చెర్రీ అన్ని విధాలా సహకరించేవాడు' అని రకుల్‌ప్రీత్ సింగ్ అన్నారు.

తన తాజా చిత్రం 'బ్రూస్‌లీ'లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి తెరను పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆ చిత్ర హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ అన్నారు. నగరంలోని సినీమ్యాక్స్ బ్లూఫాక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా త్వరలో విడుదల కానున్న బ్రూస్‌లీ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ చిత్రానికి ఇప్పటికే రావాల్సినంత క్రేజ్ వచ్చేసింది. చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపించటం అనే వార్త, శ్రీను వైట్లతో తొలిసారి చేయటం, ఇప్పటికే వదిలిన ట్రైలర్స్ సినిమా బిజినెస్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయేలా చేసాయి. దాంతో ఈ చిత్రం అన్ని ఏరియాలు అమ్ముడయ్యి...పదికోట్లు టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్ విజయ్ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఎ.ఆర్. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్: అణల్ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్కీన్ ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











