'చిరుత్తైపులి'గా అదరకొట్టనున్న రామ్ చరణ్

By Srikanya

రామ్ చరణ్ కి ఇప్పుడు తమిళంలో మంచి క్రేజ్ వచ్చింది. ఆయన గత రెండు చిత్రాలు అక్కడ విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఆయన నటించిన 'మగధీర' చిత్రంలో 'మావీరన్‌' పేరుతో అనువాద చిత్రంగా విడుదల వుంది. తాజాగా ఆయన నటించిన 'రచ్చ' చిత్రం 'రగనై' పేరుతో తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల అయింది. దీంతో రామ్‌చరణ్‌ తొలిచిత్రం 'చిరుత' కూడా 'చిరుత్తైపులి' పేరుతో విడుదల కానుంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెలాఖరులో కానీ లేదా ఆగష్టు మొదటివారంలో విడుదల కానుంది.

ప్రస్తుతం రామ్ చరణ్ తేజ 'ఎవడు'షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో ప్లాన్‌ చేశారు. సమంతా,రామ్ చరణ్‌ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఇక 'ఎవడు' చిత్రంలో డైలాగు అంటూ ఒకటి ఇప్పుడు నెట్ లోకంలో ఇప్పటిరకే బాగా పాపులర్ అయ్యిందిది. అదేమిటంటే..."నా దగ్గర ఏముందో నాకు తేలుసు...నేను అదే చెప్తున్నా...నీ దగ్గర లేనిది ఉందంటే మాత్రం ..ఇంకేమీ చెప్పను...గుడ్డలు ఊడదీస్తా..". ఈ డైలాగుని విలన్ తో హీరో అంటాడని చెప్తున్నారు. ఇక ఈ డైలాగు ని రామ్ చరణ్ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ చిత్రంలో రామ్ చరణ్ కి విలన్ గా మారారు. ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో సమంతతో పాటు సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను కూడా ఎంపిక చేశారు. 'మద్రాసు పట్టణం' అనే సినిమా ద్వారా భారతీయ సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్రిటిష్ మోడల్, ఆతర్వాత 'ఏక్ దివానాథా' అనే హిందీ చిత్రంతో పాటు, తాండవం అనే తమిళ చిత్రంలో కూడా అవకాశం దక్కించుంది. రామ్ చరణ్ 'ఎవడు' సినిమా ఆమెకు తొలి తెలుగు సినిమా కాబోతోంది.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ బాణీలతో జోరుగా ముస్తాబవుతోన్న ఈ సినిమాకి, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అల్లు అర్జున్‌ ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు. రామ్ చరణ్ మాత్రం రిలాక్స్ కాకుండా తన తర్వాత ప్రాజెక్టులలో బిజీ అయ్యిపోయారు. ప్రస్తుతం ముంబైలో కంటిన్యూగా జంజీర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తోంది. ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ సినిమాలోనూ చేస్తున్నారు. ఈ మూడు చిత్రాలూ మాస్ ని టార్గెట్ చేసినవే కావటం విశేషం. ఆరెంజ్ ప్లాప్ కావటంతో రామ్ చరణ్ పూర్తిగా తన తండ్రి నటించిన సూపర్ హిట్స్ తరహా పాత్రలనే ఎంచుకోవటానికే ఆసక్తి చూపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X