ఈ నెల 7నుంచి తమిళనాడులో రామ్ చరణ్ సందడి
చెన్నై : మరోసాతరి రామ్‌చరణ్ కోలీవుడ్‌లో రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాడు. టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా తెరంగేట్రం చేసిన రామ్‌చరణ్... మెగాపవర్‌స్టార్‌గా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. తెలుగులో ప్రస్తుత టాప్ హీరోల్లో ఒకడిగా ఎదిగాడు. తమిళ ప్రేక్షకులకూ ఆయన సుపరిచితుడే.
కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన మగధీర చిత్రం 'మావీరన్' పేరుతో ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రచ్చ సినిమా 'రగళె' పేరుతో విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఈ నేపథ్యంలో మరోసారి ఇక్కడా హంగామా చేసేందుకు సిద్ధమయ్యాడు రామ్‌చరణ్.
ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఆయన చిత్రం 'నాయక్' టాలీవుడ్‌లో హిట్ చిత్రాల జాబితాలో చేరింది. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇందులో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేశాడు.
కాజల్, అమలాపాల్ అందాలు కూడా అదనపు ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తమిళ ప్రేక్షకుల చెంతకు తీసుకురానున్నారు. 'నాయక్' పేరుతోనే ఈ నెల 7న భారీగా విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications












