twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రామ్‌చరణ్‌' ఆడియో బుధవారం విడుదలైంది

    By Srikanya
    |

    చెన్నై : మెగాస్టార్‌ నటవారసుడు రామ్‌చరణ్‌ తమిళ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. చిరంజీవి తనయుడిగా 'చిరుత'తో తెలుగులో తెరంగేట్రం చేసిన రామ్‌చరణ్‌ తన రెండో చిత్రం 'మగధీర'తో సంచలనం సృష్టించాడు. రికార్డులను తిరగరాసింది. అనంతరం ఎన్నో అంచనాలతో వచ్చిన 'ఆరెంజ్‌' ప్రేక్షకులకు మెప్పించలేకపోయినా రామ్‌చరణ్‌ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. 'బొమ్మరిల్లు' భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ వైవిధ్య ప్రేమకథలో హరీష్‌ జైరాజ్‌ సంగీతం, రామ్‌చరణ్‌ స్టెప్పులు జనాల్ని బాగా అలరించాయి.

    'ఆరెంజ్‌' ప్రస్తుతం 'రామ్‌చరణ్‌' పేరిట తమిళ ప్రేక్షకులకు వినోదం పంచనుంది. ఇందులో భాగంగా 'రామ్‌చరణ్‌' ఆడియోను బుధవారం విడుదల చేశారు. పాటలు విన్న ప్రముఖులు హారిస్‌ జైరాజ్‌ కెరీర్‌ బెస్ట్‌ ఆల్బమ్‌లో ఇది ఒకటని కొనియాడారు. తెరపై కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇందులో జెనీలియా హీరోయిన్. తమిళ నటుడు ప్రభు ఆయన తండ్రిగా కనిపించనున్నాడు. సినిమా విడుదల సందర్భంగా నగరంలోని మెగా ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

    రామ్ చరణ్,పూరీ జగన్ కాంబినేషన్ లో రూపొందిన 'చిరుత' చిత్రం తమిళంలో డబ్బింగ్ చేసారు. 'చిరుత్తై పులి' టైటిల్ తో ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేసారు. అయితే డబ్బింగ్ నిర్మాతలకు ఎదురుదెబ్బ తగలింది. మొత్తం 19 స్క్రీన్లలో అక్కడ విడుదలైన 'చిరుత్తై పులి' చిత్రం బ్యాడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. చిత్రం మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయినా శాటిలైట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ డబ్బింగ్ స్పీడు తగ్గలేదు. రామ్ చరణ్ ...రచ్చ చిత్రం కూడా'రగలై'గా విడుదలై మంచి మంచి టాకే తెచ్చుకుంది. కానీ పెద్గగా కలెక్టు చేయలేకపోయింది. అందుకు కారణం రామ్ చరణ్ మగధీర రేంజిలో ఆచిత్రం లేక పోవడమే అని విశ్లేషణలు వచ్చాయి.

    అయితే ఈ తాజా చిత్రం ఆరెంజ్ ...బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందటంతో అక్కడ బాగానే బిజినెస్ అవుతుందని బావిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి హ్యారీష్ జైరాజ్ సంగీతం అందించటం,హ్యారీస్ కు తమిళంలో మంచి మార్కెట్ ఉండటం కలిసి వస్తుందని భావిస్తున్నారు. రామ్ చరణ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో రూపొందిన ఆరెంజ్ చిత్రాన్ని నిర్మాత నాగబాబు..ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. మలేషియా, ఆస్ట్రేలియా, ముంబయి, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో షూటింగ్ జరిపారు. జెనీలియా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో షాజన్‌ పదమ్ ‌సీ సెకెండ్ హీరోయిన్ గా చేసింది. షాజన్‌ పదమ్ ‌సీ సినిమా ఫ్లాష్ ‌బ్యాక్‌ సన్నివేశాల్లో ఆమె పాత్ర వస్తుంది. సినిమా ప్లాప్ అయినప్పటికీ పాటలు ఇక్కడ హిట్ అయ్యాయి. మరి తమిళంలో ఏమి జరగనుందో చూడాలి.

    English summary
    
 Ram Charan’s Orange to be dubbed in Tamil.After the Success of magadheera it was dubbed in tamil as mahaveeran which was a huge hit and it was then followed by Racha, which was dubbed as Ragalai.Ragalai has done good business in tamil and fetched him as one of the commercial star in Tamilnadu. In recent times, Ram Charan’s debut film Chirutha was dubbed in Tamil as Sirutthai Puli and now Orange is being dubbed in Tamil.Although the film failed to click at the box office, Harris Jayaraj’s music rocked the music world and B Rajasekhar, Kiran Reddy’s cinematography was highly appreciated.But the funny thing here is in tamil orange movie is named as ‘Ram Charan’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X