సర్ ప్రైజ్ చేసిన రామ్ చరణ్ కి రికార్డ్ బ్రేక్ ఇస్తారా..!?
తమిళంలో 'మావీరన్"గా వస్తున్న 'మగధీర" హీరో రామ్ చరణ్ తేజ ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో చక్కటి తమిళంలో మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్య చకితులను చేసాడు. ఇంత ధారాళమైన తమిళం వచ్చా తెలుగు తారలకు అని చెన్నైలో అందరూ ముక్కుమీద వేలేసుకున్నారు. రాజమౌళి సరే తమిళనాడులో పుట్టి పెరిగారు. అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య కాలం నుంచీ తమిళనాడులో తిరిగినవారే. కానీ రామ్ చరణ్ తమిళనాడులో అంతగా తిరిగినవాడు కాదు అయినా తమిళం తప్పుల్లేకపోవటమే కాదు ధారాళంగా ఉంది.
ఈ లెక్కన మగధీర, అదే మావారన్ తమిళనాడులో హిట్ కొట్టేట్టుగానే వుంది. ఎందుకంటే ఆడియో రిలీజ్ లోనే ప్రేక్షకులకు ఆ సినిమా మీద అంచనాలు మొదలవుతాయి. హీరో మీద ఇష్టం ఏర్పడటం చాలా ముఖ్యం. మాతృభాషమీద మక్కువ ఎక్కువగా ఉన్న తమిళులచేత 'నంబాళ్" అంటే మనవాడు అనిపించుకున్న వాడే రాణిస్తాడు. ఆపనిలో రామ్ చరణ్ విజయం సాధించాడు. ఇక మిగిలింది సినిమా విడుదలే. దీన్ని డబ్ చెయ్యటంలో తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తేనే అది ఎంత హిట్ అవుతుందో అర్థమవుతోంది. డబ్బింగ్ లా కాకుండా తమిళభాషా చిత్రమేనేమో అనే భ్రమ కలిగించాలి..!


Click it and Unblock the Notifications











