'తమిళం'లో 'మగధీర'
తమిళంలో విజయం సాధించిన చిత్రాలు తెలుగు అనువదించబడటం కొన్నేళ్లుగా నడుస్తున్న సంప్రదాయం. ఇప్పుడిప్పుడే మన తెలుగు నిర్మాతలూ ఆ దారిన నడుస్తున్నారు. ఈ మధ్యనే తెలుగులో మంచి విజయాన్ని సాధించిన 'అరుంధతి' చిత్రాన్ని అదే పేరుతో తమిళంలో అనువదించి విడుదల చేసారు నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.
తాజాగా ఇదే విధంగా రామ్ చరణ్ నటించిన 'మగధీర' చిత్రాన్ని కూడా కొన్ని మార్పులతో తమిళంలో విడుదల చెయ్యనికి చిత్ర నిర్మాత అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తమిళ నేటివిటీకి అనుగునంగా వడివేలుతో ఓ కామెడీ ట్రాక్ ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా 'శ్రీ హరి' పోషించిన 'షేర్ ఖాన్' పాత్రధారున్ని కూడా మార్చబోతున్నారు. శరత్ కుమార్ లేదా అర్జన్ ను ఈ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్టు సమాచారం.
ఇక ఈ చిత్రానికి 'మా వీరన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇది రజనీకాంత్ నటించిన ఒకప్పటి హిట్ మూవీ టైటిల్.


Click it and Unblock the Notifications











