రామ్ చరణ్, మురగదాస్ కాంబినేషన్ చిత్రం ప్లానింగ్
గజనీ చిత్రంతో స్టార్ డైరక్టర్ గా ఎదిగిన మురగదాస్ దర్శకత్వంలో రామ్ చరణ్ ని నటింపచేయటానికి సన్నాహాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఛత్రపతి చిత్రం నిర్మించిన బివియస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రం చేయాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. మెరుపు చిత్రం పూర్తవగానే ఈ ప్రాజెక్టుని మెటీరియలైజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. మురగదాస్ తో అల్లు అరవింద్ కి ఉన్న రిలేషన్ దృష్ట్యా ఇది మెటీరియలైజ్ అవుతోందని అంటున్నారు. ఇంతకుముందు మురగదాస్ దర్సకత్వంలో చిరంజీవి హీరోగా స్టాలిన్ చిత్రం రూపొందించారు. అలాగే చిరంజీవి సూపర్ హిట్ ఠాగూర్ కూడా మురుగదాస్ చిత్రం రీమేక్. అలాగే అమీర్ ఖాన్, మురగదాస్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ గజనీకి అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ అన్న సంగతి తెలిసిందే. ఇక నిర్మాత బివియస్ ఎన్ ప్రసాద్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ చిత్రం చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











