తమిళ ‘మగధీర’ కు భాగ్యరాజా మాటలు-రామ్ చరణ్ తన పాత్రకి తానే డబ్బింగ్!
టాలీవుడ్లో సంచలనం సృష్టించిన 'మగధీర" తమిళంలో 'మన్నాది మన్నన్" పేరుతో అనువాదమవుతోంది. ఒక స్ట్రయిట్ మూవీలా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. తన చిత్రాలకు మాత్రమే మాటలు రాసుకునే నటుడు, రచయిత, దర్శకుడు కె. భాగ్యరాజా తొలిసారి 'మన్నాది మన్నన్" కు మాటలు రాస్తున్నారు. అలాగే సీనియర్ గేయ రచయిత వాలి పాటలు రాస్తున్నారు. ఈ చిత్ర తమిళ హక్కులను కలైపులి యస్. ధాను సొంతం చేసుకున్నారు. సునీల్ కామెడీ ట్రాక్ ను వడివేలుతో రీషూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 60వ దశకంలో యం.జి.ఆర్ నటించిన 'మన్నాది మన్నన్" టైటిల్ తో తెలుగు మగధీర తమిళంలోకి జూన్ లో అడుగుపెడుతున్నాడు. రామచరణ్ తమిళంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడం విశేషం.
More from Filmibeat
మగధీర రామ్ చరణ్ తేజ్ భాగ్యరాజా మన్నాది మన్నన్ యస్ ధాను సునీల్ వడివేలు magadheera ram charan teja bhagya raj mannadhi mannan s dhanu sunil vadivelu


Click it and Unblock the Notifications











