అక్కడి మెగా అభిమానులకు షాకింగ్ న్యూస్: రామ్ చరణ్ సినిమా విడుదల వాయిదా

సినిమాల్లోకి ప్రవేశించిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ ఆరంభం నుంచే ఎన్నో హిట్లను అందుకున్న అతడు.. నటుడిగా పరిణితిని పొందుతున్నాడు. అతడి ప్రయాణంలో విజయంతో పాటు నటుడిగా మంచి గుర్తింపును తెచ్చిన చిత్రాల్లో 'రంగస్థలం' ఒకటి. చెవుడు ఉన్న వ్యక్తిగా ఇందులో చరణ్ చేసిన నటన అద్భుతమనే చెప్పాలి. సుకుమార్ రూపొందించిన ఈ సినిమా భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో పాటు చరణ్‌లోని మరో నటుడిని ప్రపంచానికి పరిచయం చేసింది. అలాగే, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది.

తెలుగులో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న 'రంగస్థలం' సినిమాను రీమేక్ చేయడానికి, డబ్బింగ్ చేసుకోడానికి ఎంతో మంది దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. అదే క్రమంలో ఇప్పటికే పలు భాషల్లోకి డబ్బింగ్ చేశారు. మలయాళం, కన్నడంలో ఎన్నో అంచనాలతో విడుదలై ఈ మూవీ భారీ ఆదరణను అందుకుని సత్తా చాటింది. ఇప్పుడు తమిళంలోకి దీన్ని తీసుకెళ్తున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. అలాగే, దీన్ని ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది.

Ram Charans Rangasthalam Tamil Release Postponed

విడుదలకు సమయం దగ్గర పడడంతో 'రంగస్థలం' తమిళ వెర్షన్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవలే విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకూ ఈ వీడియోకు 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక, ఈ సినిమా విడుదల విషయంలో తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వచ్చింది. దీని ప్రకారం.. 'రంగస్థలం' తమిళ వెర్షన్ రిలీజ్ ఆగిపోయిందట. దీనికి కారణం తమిళనాడులో ఈ నెల 26 నుంచి స్వచ్చంద లాక్‌డౌన్ ప్రకటించడమేనని తెలుస్తోంది. దీని వల్ల థియేటర్లు కూడా మూత పడనున్నాయి. అందుకే ఈ సినిమా విడుదల ఆగిపోయినట్లు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X