‘ఆది’ కి జెర్క్ ఇచ్చిన రామగోపాల్ వర్మ

By Sindhu

పరిటాల రవీంద్ర జీవితచరిత్రపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరెకెక్కించాలనుకుంటున్న రామ్ గోపాల్ వర్మ పేరు చెబితే సంచలనాలే గుర్తుకు వస్తాయి. అయితే ఇటీవల కాలంలో ఆయన తీసే సినిమాలు విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తూ విడుదలైన తర్వాత బాంక్సాఫీస్ వద్దే బోర్లాపడుతున్నాయి. అయినప్పటికీ వర్మ తనదైన శైలిలో సినిమాలు తీయడానికి వెనుకాడటం లేదు. తాజాగా ఆయన పరిటాల రవి జీవిత చరిత్రతో 'రక్త చరిత్ర' చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. తెలుగు హీరో లేకుండా తీస్తున్న తెలుగు సినిమా ఇది కావడం విశేషం. అయితే ఒ కీలక పాత్ర కోసం విలక్షణ నటుడు మోహన్ బాబు ఎంపిక చేసినట్టు సమాచారం.

అనంతపురం జిల్లా పెనుగొండ దివంగత మాజీ ఎమ్మల్యే పరిటాల రవి - ఆయన ప్రత్యర్థి మద్దెల చెర్వు సూరి మధ్య రియల్ లైఫ్ లో చోటు చేసుకున్న ఘట్టాలను వర్మ వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో ఈ చిత్రాన్ని చేయనున్నారు. ఈ 3 భాషల్లోనూ పరిటాల రవి పాత్రను వివేక్ ఒబెరాయ్ పోషించనుండగా, సూరి పాత్రను తమిళ హీరో సూర్య చేయబోతున్నారు. తెలుగు వెర్షన్ లో పరిటాల రవి పాత్రను ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది (మృగం)పోషిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను వర్మ తాజాగా ఖండించారు.

ప్రదీప్ పినిశెట్టి అలియాస్ ఆదితో అగ్రిమెంట్ చేసిన విషయం నిజమేననీ, అయితే అది 'రక్తచరిత్ర' సినిమా కోసం కాదనీ వర్మ వివరణ ఇచ్చారు. ధర్మ-రక్ష అనే కొత్త దర్శకులతో ఈ సినిమా ఉంటుందన్నారు. 'రక్తచరిత్ర' మూడు భాషల్లోనూ వివేక్, సూరి నటిస్తారనీ, వివేక్ విషయానికి వస్తే అతని తండ్రి హైద్రాబాద్ నుంచి వచ్చిన వారేననీ, దాంతో వివేక్ కు తెలుగు బాగా వచ్చనీ అన్నారు. అయితే వాక్ చాతుర్యంలో పెర్ ఫెక్షన్ కోసం అతను శిక్షణ కూడా తీసుకుంటున్నారని తెలిపారు.

ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ పొలిటికల్ అంశాలు ఎక్కువగా ఉండే రక్తచరిత్ర చిత్రంలో ఇంతకీ మోహన్ బాబు ఏ పాత్ర పోషించబోతున్నారు. టిడిపి వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రోల్ లో ఆయన కన్పించబోతున్నారట. పలు సినీ ఫంక్షన్ల లో అన్నయ్య ఎన్టీఆర్ తన ఆరాధ్య దైవమని పేర్కొనే మోహన్ బాబు ఆయన పాత్రలో ఏ విధంగా నటిస్తారో వెండితెర పై చూడాల్సిందే. ఇక ఈ చిత్రం ద్వారా మణిశర్మ సంగీత దర్శకుడుగా తొలిసారి హిందీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. నాలుగున్నర గంటల నిడివితో రెండు భాగాలుగా 'రక్తచరిత్ర' తెరకెక్కనుంది. రాయలసీమ ఏరియాల్లో ఎక్కువ భాగం షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X