సెట్స్ నుంచి కోపంగా హీరో రామ్ బయిటకు
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో రామ్ హీరో గా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం నుంచిరామ్ వైదొలిగే అవకాసమున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం గౌతమ్ మీనన్ అని చెప్తున్నారు. గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని మూడు భాషల్లో తీస్తున్నారు.తెలుగుకు రామ్ హీరో అయితే హిందీకి ఆదిత్యారాయ్, తమిళంలో జీవా చేస్తున్నారు. వీరి ముగ్గురు చేతా సీన్స్ ఒకేసారి చిత్రీకరిస్తున్నారు.సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో ఏ భాషకు తగినట్లు అలా ప్యాడింగ్ ఆర్టిస్టులు మారిపోతారు. ఈ నేపధ్యంలో చాలా సమయం తీసుకుంటోంది. మిగతా ఇద్దరితో సీన్ తీసి తన దగ్గరికి వచ్చేటప్పటికి చాలా సమయం పట్టడం రామ్ ని అసహనానికి గురి చేసింది.దాంతో అతను కోపంగా సెట్స్ మీదనుంచి బయిటకు వచ్చేసారు.
తను ఖాళీగా అంతసేపు కూర్చోటేవటం రామ్ కి నచ్చలేదుట. దాంతో గౌతమ్ మీనన్ కి ఈ విషయం చెప్పినా ఆయన మొదటే ముగ్గురుతో ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పాను కదా తప్పదని తేల్చేసారు. ఇక ఈ విషయమై చెన్నై మీడియా వారు గౌతమ్ మీనన్ ని సంప్రదించగా...ఈ విషయమై ఇప్పుడే మాట్లాడటం భావ్యం కాదు..నేను పరిస్ధితులు అన్నీ చక్కబడతాయనే అనుకుంటున్నాను అన్నారు. అలాగే ఈ చిత్రంలో రామ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గా కనిపిస్తారు. సమంత సైకాలజి స్టూటెండ్ గా కనిపించనుంది.


Click it and Unblock the Notifications











