'జర్ని'దర్శకుడు నెక్స్ట్ తెలుగు హీరోతో ఖరారు

By Srikanya

జర్నీ చిత్రంతో శభాష్ అనిపించుకున్న తమిళ దర్సకుడు శరవణన్. ఆయన దర్సకత్వంలో యంగ్ హీరో రామ్ నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో వీరిద్దరూ కాంబినేషన్ లో జస్ట్ గణేష్ చిత్రం వచ్చింది కానీ ఆడలేదు. అయితే జర్నితో హిట్ కొట్టడంతో రామ్ పిలిచి మళ్లీ సినిమా ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ చిత్రంతో రామ్ తమిళ తెరకు సైతం పరిచయం కానున్నాడు. తమిళ,తెలుగు భాషల్లో ఈ చిత్రం తయారు కానుంది. ఇంతకుముందే రామ్ ...గౌతమ్‌మీనన్ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం నుంచి వైదొలిగారు.

అదే విధంగా శరవణన్ దర్శకత్వంలో తిరుపతి బ్రదర్స్ నిర్మిస్తున్న నూతన చిత్రంలో తొలుత ఆర్యను హీరోగా ఎంపిక చేశారు. ఆయన తప్పుకోవడంతో ఆ పాత్రకు తెలుగు నటుడు రామ్‌ను ఎంపిక చేశారు. దీని గురించి దర్శకుడు శరవణన్ తెలుపుతూ తన స్క్రిప్టును ఆర్యకు చెప్పినప్పుడు చాలా బాగుంది చేద్దామని తెలిపారని పేర్కొన్నారు. కొన్ని కారణాల వల్ల ఆయన వైదొలగడంతో నిర్మాత లింగుస్వామి తెలుగు నటుడు రామ్‌ను ఎంపిక చేశారని వివరించారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నామని చెప్పారు. ఈ వ్యవహారం గురించి ఆర్యను అడగగా శరవణన్ చెప్పిన కథ తనకు నచ్చకపోవడంతో చిత్రం నుంచి తప్పుకున్నానని తెలిపారు. ఇక రామ్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో ఎందుకంటే ప్రేమంట చిత్రం చేస్తున్నారు. అలాగే రగడ దర్శకుడు వీరూపోట్లతో ఓ చిత్రం కమిటయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X