రామ్ చిత్రం విడుదలకు సమస్య

By Srikanya

చెన్నై: రామ్, తమన్నా కాంబినేషన్ లో తమిళ దర్శకుడు కరుణాకన్ రూపొందించిన చిత్రం 'ఎందుకంటే ప్రేమంట'. తెలుగులో ఈ చిత్రం రిలీజై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తమిళ వెర్షన్ విడుదలపై సందిగ్ధత కొనసాగుతోంది. తెలుగు వెర్షన్ థియేటర్లలోకి రాకముందు చెన్నైలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన చిత్ర బృందం 'ఏనెండ్రాల్‌ కాదల్‌ ఎన్బేం' పేరుతో తమిళంలోనూ కొద్దిపాటి మార్పులతో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

తెలుగులో సాధించిన ఫలితంతో దర్శకుడు తమిళ వెర్షన్‌కు భారీగానే మార్పులు చేయాలని నిర్ణయించుకున్నాడు. త్వరలోనే తమిళతంబీల చెంతకు వస్తుందని అందరూ ఎదురు చూశారు. అయితే ఇప్పటి వరకు విడుదలపై ఎలాంటి సమాచారం రాలేదు. అయితే తమన్నా మాత్రం త్వరలోనే విడుదలయ్యే ఈ సినిమా తనకు మంచిపేరు తెస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ చిత్రానికి మార్కెట్ కాలేదని అందుకే విడుదల కాలేదని సమాచారం. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తే ఈ సమస్య ఉండకపోయేది.

ఇక ఈ చిత్రం తెలుగులో ప్లాఫ్ అయినప్పుడు రామ్ మాట్లాడుతూ...'బతికున్నప్పుడు మనిషి ఆత్మ బయటకు రావడం ఏమిటి? అని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. కానీ హాలీవుడ్ లో తీసినప్పుడు రానీ అనుమానాలు ఇక్కడ రావటం ఆశ్చర్యంగా ఉంది. అయినా తెలుగులో వస్తున్న సినిమాలన్నీ ఇంచుమించు ఒకే తరహాలో ఉంటున్నాయి. వీటి మధ్య మా సినిమా కాస్త విభిన్నంగా ఉండాలనుకొన్నాం. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే 'ఎందుకంటే ప్రేమంట అన్నారు రామ్‌.

''మొదటి పది నిమిషాలూ కథకు కీలకం. దాన్ని ఆధారంగా చేసుకొనే మిగతా కథ అల్లుకొన్నాం. ఈ సినిమా మొదటి పది నిమిషాలు మిస్ అయిన వారికి కథ, కథనాల విషయంలో రకరకాల డౌట్స్ ఉత్పన్నమవుతాయి. అందుకే ఎక్కడా మిస్ అవ్వకుండా సినిమా చూడాలి. అలా చూసిన ప్రేక్షకులకు తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది. ప్రస్తుతం సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు'' అని స్రవంతి రవికిషోర్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X