ప్రభుదేవా, నయనతార లవ్ స్టోరీలో మరో ట్విస్ట్
ప్రభుదేవా, నయనతార ప్రేమ కథ మరో మలుపు తిరగనుంది. ఇద్దరు బిడ్డల తండ్రైన ప్రభుదేవా..హీరోయిన్ నయనతారను పెళ్లాడనున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన నాటి నుంచి ఆయన భార్య రమలత్ తీవ్రంగా ఆవేదన చెందుతోంది. ఈ నేపథ్యంలో తనకు జరుగుతున్న అన్యాయంపై నిరాహార దీక్షకు దిగాలని ఆమె భావిస్తోంది. ఇందుకు అవసరమైన సన్నాహాలు చేసుకుంటోంది. ఈ వ్యవహారంలో మహిళా సంఘాలన్నీ ఇప్పటికే ఆమెకు బాసటగా నిలిచాయి. నయనతారను చట్టం ఎదుట నిలబెతామంటూ పలువురు మహిళా న్యాయవాదులు తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న ప్రభుదేవా చెన్నై రాగానే ఆయనతో ముఖాముఖి చర్చించి ఆ తర్వాత తన దీక్ష గురించి తుది నిర్ణయం తీసుకుంటానని రమలత్ ప్రకటించింది.ఇక ఆ మధ్య ప్రభుదేవా భార్య రమాలత నుంచి తనకు ప్రమాదం ఉందని తాజాగా నయనతార ప్రెవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంది.ఇక నయనతార ప్రస్తుతం ఆర్య హీరోగా చేసిన 'బాస్ అలియాస్ భాస్కరన్' చిత్రం హిట్ అవటంతో ఉత్సాహంగా ఉంది.


Click it and Unblock the Notifications











