ప్లీజ్...ఆ ఒక్కటీ అడక్కండి అంటున్న రంభ
రంభ లేటెస్ట్ గా కెనడా వ్యాపారవేత్త ఇంద్రన్ ను మ్యారేజ్ చేసుకోనుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో నిజం లేదని రంభ కొట్టి పారేస్తోంది. అయితే ఇంద్రన్ పద్మనాధన్ పెళ్ళి ప్రపోజల్ చేసిన మాట నిజమేననీ, అయితే ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదనీ ఆమె వెల్లడించింది. 'వివాహానికి సంబంధించిన అంశం ఇంకా డిస్కసింగ్ స్టేజ్ లోనే ఉంది. వివాహ ప్రస్తావన ఇంద్రన్ నుంచే వచ్చింది. అయితే ఇంకా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు' అని చెప్పింది రంభ. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు త్వరలోనే సమావేశమై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ, డిసెంబర్ లో పెళ్లి చేసుకుంటాననే వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. తన కజిన్స్ లో ఒకరి వివాహం కుదరడంతో తన పేరిట మ్యారేజ్ హాలు బుక్ చేయడం జరిగిందనీ, దీంతో రంభ పెళ్లయిపోతోందంటూ వదంతులు మొదలయ్యాయనీ ఆమె నవ్వుతూ చెప్పింది. ప్రస్తుతం రంభ తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న'ప్రతిక్షణం' చిత్రంలో నటిస్తోంది. రంభ సోదరుడు నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోది. అలాగే హాలీవుడ్ 'క్విక్ గన్ మురుగన్' సీక్వెల్ కు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తానని చెప్తోంది. మొత్తానికి రంభ పెళ్లి కథ అలా మళ్ళీ మొదటికొచ్చింది. అలాగే రంభ ప్రతీసారీ పెళ్ళి ప్రస్ధావన తేవద్దని,అది తన కెరీర్ పైన ప్రభావం చూపుతుందని చెపుతోంది.


Click it and Unblock the Notifications











