సిట్యువేషన్ చాలా సీరియస్ గా ఉందని ప్రెవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయిన ప్రముఖ సినీ నటి రంభ ప్రస్తుతం క్షేమం గానే ఉంది. ఆ విషయాన్ని తెలియచేసేందుకు చెన్నై లో ఈ రోజు ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అందరూ చెప్పుకుంటున్నట్లుగా తాను ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదని...ఫుడ్ పాయిజింగ్ జరగటంతో హాస్పటిల్ లో చేరాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. అంతే గాక తనపై లేనిపోని రూమర్స్ ని ప్రచారం చేస్తున్నారంటూ విరుచుకు పడింది. దాంతో అక్కడికి వచ్చిన తమిళ మీడియారు గతుక్కుమన్నారుట. ఆమె ఆసుపత్రిలో చేరటం నిజమే...డాక్టర్లు పాయిజన్ తో అక్కడికి వచ్చిందని చెప్పటం నిజమే...ప్రేమ ఫెయిల్యూర్ నిజమే...ఇంక మళ్ళీ ఈ అనవసర నిందలేమిటో అనుకుంటూ వెళ్ళారట.