రంభ..పిల్లలున్న పిల్లా?
పిల్లి..ల్లల్ని పెట్టి తొమ్మిది ఇళ్లు మార్చినట్లు నా పరిస్ధితి మారిపోయింది..అంటోంది రంభ నిట్టూరుస్తూ. ఈ మధ్య ఆమె మేంగో డాలీగా నటించిన 'క్విక్ గన్ మురగన్' సినిమా రిలీజైంది. దాని సక్సెస్ మీట్ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది.నవ్వుతూ చెప్పినా అందులో బాధ ద్వనించింది. నాకు అన్ని చోట్ల నుండి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి..చేస్తూనే ఉన్నాను. కానీ పర్మెనెంట్ గా ఎక్కడా నిలబడలేకపోతున్నాను అంది. నేను ఇక ఆఫర్స్ రావులే అనుకున్నప్పుడే అవి వస్తాయి. వస్తే బాగుండును అనుకున్నప్పుడు చస్తే రావు అంది. తను అందరు స్టార్స్ తో చేసినా ఈ రోజు తన పరిస్దితి అస్ధితిమంగా ఉండటానికి ఎవరూ రికమెండ్ చేయకపోవటానికి కారణంగా ఎవర్నీ నిందించక్కర్లేదంటోంది. ఇక బాలీవుడ్ గురించి ఆమె మాట్లాడుతూ అక్కడ రెస్పాన్స్ బాగానే వచ్చినా అనుకున్నంతగా ఇమడలేకపోయానంది. ఇక మీర ఎవరుతో చేద్దామనుకుంటున్నారు అంటే..ఇంకెవరూ ఖాన్స్,కపూర్స్,రోషన్లలతో అంటూ ముగించింది.


Click it and Unblock the Notifications











