రాఖీ రూట్లో 'రంభ'...
బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ తనకు కాబోయే వరుడిని ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన స్వయంవరం ద్వారా ఎన్నుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఇదొక సంచలనం.. అంతే కాకుండా ఆ టీవీ ఛానెల్ రేటింగ్ కూడా పెరిగింది. ఇప్పుడు ఇదే దారిన నడవనున్నారు మన బెజవాడ అమ్మాయి రంభ. ఆ మధ్యన ఈ వార్తలను ఖండించిన రంభ ఇప్పుడు అదే దారిన వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఓ ప్రముఖ తమిళ టీవీ ఛానెల్ లో రంభ స్వయంవర కార్యక్రమం జరుగుతుందని సమాచారం. చూస్తుంటే ఈ టీవీ ఛానెల్స్ పుణ్యమా అని సెలబ్రిటీల స్వయంవరం మోస్ట్ కామన్ ఫీచర్ అయిపోయేలా వుంది.
ఇదిలా వుంచితే రంభ అభిమానులకు మాత్రం ఇది తీపి కబురే.. మొన్నీ మధ్య రంభను చూడటానికి వెళ్లి ఆమె ఇంటి ముందు గలాబా సృష్టించిన ఆమె వీరాభిమానులకి ఏకంగా తమ అభిమాన నటిని లైఫ్ పార్టనర్ చేసుకొనే అవకాశం.. కానీ ఇందులో ఎంత మందికి స్థానం లభిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి...


Click it and Unblock the Notifications











